Yawning: తరచూ ఆవలింతలు వస్తున్నాయా..వీటిని ఆపేదెలా?

ఎక్కువ పని చేయడం వల్ల అలసట, బద్ధకం అనిపించి బద్ధకం వల్ల నిద్ర వస్తుంది. దీని సిగ్నల్ ఆవలింత రూపంలో మన మెదడు, శరీరానికి అందుతుంది. నీరు, కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ తాగాలి. విపరీతంగా ఆవలిస్తే దంతాలను బిగుతుగా చేస్తే వెంటనే ఆవలింత ఆగిపోతుంది.

New Update
Yawning: తరచూ ఆవలింతలు వస్తున్నాయా..వీటిని ఆపేదెలా?

Yawning : సాధారణంగా ఆవలింతలు వస్తుంటాయి. కానీ ఏదైనా ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు ఆవలింత వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా ఆవలింతలు రావడం కూడా ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. ఆవలింతలను ఎలా ఆపాలి.. ఎక్కువగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం బాగా అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా ఆవలింత వస్తుంది. అలాగే కొన్నిసార్లు చదువుతున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు విసుగుచెందినా ఆవలింతలు వస్తుంటాయి. అలాగే మన పక్కవారు ఆవలించినా వెంటనే మనకు కూడా ఆవలింత వచ్చేస్తుంది. కొన్నిసార్లు వేసవిలో మెదడులో వేడి బాగా పెరుగుతుంది. మెదడుకు తగిన ఆక్సిజన్‌ అందకపోతే ఆవలింత వస్తుంది. ఏదైనా మీటింగ్‌లో ఆవలిస్తే ఎదుటి వ్యక్తులకు వాళ్లు చెప్పేది మనం వినడం లేదేమో అన్న సందేహం కలుగుతుంది. దాంతో మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.

అసలు ఆవలింత రావడానికి కారణమేంటి?

  • ఎక్కువ పని చేయడం వల్ల అలసట, బద్ధకం అనిపించి బద్ధకం వల్ల నిద్ర వస్తుంది. నిద్ర కారణంగా మన శక్తి స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో దానిని పెంచడానికి ఆక్సిజన్ చాలా అవసరం. దీని సిగ్నల్ ఆవలింత రూపంలో మన మెదడు, శరీరానికి అందుతుంది. ఆవలింతను ఆపాడం చాలా కష్టం. పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా విపరీతమైన ఆవలింతలు వస్తాయి. కొన్నిసార్లు విపరీతమైన ఆవలింత బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్ మరియు మూర్ఛ వంటి కొన్ని తీవ్రమైన వ్యాధులను కూడా సూచిస్తుంది. అందుకే ఎక్కువగా ఆవలింతలు వస్తే వైద్యులను సంప్రదించాలి.

ఆవలింత రాకుండా చిట్కాలు

  • పని చేయడం వల్ల మీరు చాలా అలసిపోతే.. మిమ్మల్ని మీరు శక్తివంతంగా మార్చుకోవడానికి మెట్లు పైకి క్రిందికి నడవండి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఆవలింతలు రావు. ఆహారం తిన్న తర్వాత పైకి క్రిందికి ఎక్కడం చేయకూడదు. ఏదైనా బరువు తీసుకుని కూడా మెట్లు ఎక్కకూడదు.

నీరు తాగాలి

  • మీరు ఎక్కువగా ఆవలిస్తే ముందుగా నీటిని తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోండి. కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ లేదా లెమన్ వాటర్ తాగడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు.

కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌

  • ఏదైనా శీతలపానీయాలు, ఎనర్జీ డ్రింక్‌లు కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే పని మధ్యలో లేచి నడవడం, చేతులు, కాళ్లను సాగదీయడం వంటివి చేస్తుండాలి.

దంతాలను బిగించడం

  • విపరీతంగా ఆవలిస్తే దంతాలను బిగుతుగా చేస్తే వెంటనే ఆవలింత ఆగిపోతుంది.

ఇది కూడా చదవండి: నాలుక మంటను వెంటనే తగ్గించే చిట్కాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు