Gannavaram: సొంత చెల్లి.. కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదు: యార్లగడ్డ వెంకట్రావు సెటైర్స్!

గన్నవరం ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు యార్లగడ్డ వెంకట్రావు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా కుదరలేదని, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నారు. సొంత చెల్లి, కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

author-image
By srinivas
Gannavaram: సొంత చెల్లి.. కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదు: యార్లగడ్డ వెంకట్రావు సెటైర్స్!
New Update

Yarlagadda venkat rao: గన్నవరం ఎమ్మెల్యేగా తనను ఎన్నుకున్నందుకు గన్నవరం ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశాడు టీడీపీ యార్లగడ్డ వెంకట్రావు. నిజానికి ఎన్నికలకు ముందే తాను గెలిచాను భావిస్తున్నట్లు తెలిపాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారని అన్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ.. నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఎమ్మెల్యే అవ్వాలని బలంగా అనుకున్నాను. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసివేయాలని జగన్ ఆరోజున అనుకున్నాడు. జగన్ కుట్రలు పన్నాడు. కానీ కుదరలేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేశారు. జగన్ కక్ష సాధింపు రాజకీయాలు చేశారు. సొంత చెల్లికే కాదు...కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్నికలకు ముందే గెలుస్తానని తెలుసు..

ఈసారి తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తానని జగన్ కు ఎన్నికల ముందే సవాల్ చేశానని చెప్పారు. శాసనసభకు జగన్ వస్తాడో లేదో చూడాలి. ప్రజలు కక్షా రాజకీయాలు చూసి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. జనసేన పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. గతంలో రాజకీయాల్లో అవమానాలు భరించాను. తాజాగా జరిగిన ఎన్నికల్లో భావోద్వేగాలు మోసాను. గన్నవరం సీటు గెలిచి చంద్రబాబు, భువనేశ్వరికి బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది. నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను. గన్నవరంలో శాంతి భద్రతలు,గంజాయ్ కంట్రోల్ చేస్తాను. పనికిమాలిన పనులు చేయను. వేధింపు రాజకీయాలు,కక్ష పూరిత రాజకీయాలు అసలే చేయను. నేనేమి స్వామీజిని కాదు.. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. మట్టి మాఫియాను వదలను. మాఫియాకు సహకరించిన అధికారులను విడిచిపెట్టను. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే నేను వైసీపీ పార్టీలో ఉన్నపుడే అడ్డుకున్నాను. ప్రయివేటు ఆస్తులు కూడా కబ్జాకు గురయ్యాయి. నేను గన్నవరం ప్రజలకు 24 గంటలు అందుబాటులోనే ఉంటాను. నేను ఎమ్మెల్యే అయ్యేందుకే అమెరికా నుండి గన్నవరం వచ్చాను. గన్నవరం నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ వెంకట్రావ్ హామీ ఇచ్చారు.

#tdp #gannavaram #yarlagadda-venkat-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe