Chiranjeevi: మళ్లీ ఒక్కటైన మిత్రులు.. చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత ఆ రచయితకే!

నటుడు చిరంజీవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. యండమూరి వీరేంద్రనాథ్‌ ఈ బాధ్యత తీసుకోబోతున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. 'నా బయోగ్రఫీ యండమూరి వంటి గొప్ప రచయిత రాస్తానని మాటివ్వడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ పని మొదలవుతుంది' అని చిరు చెప్పారు.

New Update
Chiranjeevi: మళ్లీ ఒక్కటైన మిత్రులు.. చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత ఆ రచయితకే!

Chiranjeevi Biography: మెగాస్టార్ చిరంజీవి  జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ (NTR) 28వ పుణ్యతిథి, ఏఎన్ఆర్ (ANR) శతజయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కళామతల్లి ముద్దు బిడ్డలని, వారితో కలిసి పనిచేసేటపుడు ఎన్నో విలువైన సహాలు ఇచ్చేవారని తెలిపారు.

publive-image

బయోగ్రఫీ బాధ్యత యండమూరికే..
ఈ క్రమంలోనే తన ఆటో బయోగ్రఫీ గురించి చెబుతూ.. బయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ (Yandamuri Virendranath)కు అప్పగించినట్లు స్వయంగా ప్రకటించారు. 'నా బయోగ్రఫీ యండమూరి వంటి గొప్ప రచయిత రాస్తానని మాటివ్వడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ పని మొదలవుతుంది'అన్నారు. అలాగే తను స్టార్ హీరో కావడంలో యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక కారణమని చెప్పారు. చిరంజీవి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఇక తన బలహీనతలను బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకున్నానని చిరు చెప్పారు.

ఇది కూడా చదవండి : Katrina: నాకూ అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కత్రినా కైఫ్

8ఏళ్ల తర్వాత కలిసి..
ఇదిలావుంటే.. కొన్నేళ్లుగా దూరమైన మెగాస్టార్ చిరంజీవి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మళ్లీ ఒక్కటికావడంతో ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. 80వ దశకంలో చిరంజీవి-యండమూరి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, యండమూరి ఎంతో సన్నిహితులుగా మెలిగేవారు. అయితే 8 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్.. హీరో రామ్ చరణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు యండమూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నాగబాబు -యండమూరి కొద్దిరోజుల పాటు పరస్పరం దూషించుకున్నారు. అప్పటినుంచి చిరంజీవి, యండమూరికి మధ్య దూరం పెరిగింది.

ఇక లాస్ట్ ఇయర్ ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’లతో అభిమానులను అలరించిన చిరు.. ప్రస్తుతం 156 వ సినిమాగా ‘విశ్వంభర’ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా ఇటీవలే షూటింగ్ మొదలైంది. 2025 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Advertisment
తాజా కథనాలు