Yami Gautam: అది దృష్టిలో పెట్టుకునే ఇలాంటి సినిమాలు చేస్తున్నా!

‘ఆర్టికల్‌ 370’తో భారీ విజయం సొంతం చేసుకున్న నటి యామీ గౌతమ్.. ప్రాజెక్టుల ఎంపిక గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా పాత్ర కథలో ముఖ్య పాత్ర పోషించాలి. ప్రేక్షకులు కథకు కనెక్ట్‌ అవ్వాలి. వేదికేదైనా వారు ఆ కథతో ముందుకు సాగాలనేది నా అభిప్రాయం'అంటూ చెప్పుకొచ్చింది.

New Update
Yami Gautam: అది దృష్టిలో పెట్టుకునే ఇలాంటి సినిమాలు చేస్తున్నా!

Yami Gautam: సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో అదరగొడుతున్న యామీ గౌతమ్ ప్రాజెక్టుల ఎంపికకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్టికల్‌ 370’తో భారీ విజయాన్ని అందుకున్న నటి.. ఎల్లప్పుడూ తనను తెరపై చూసుకున్నప్పుడే సంతోషంగా ఉంటానంటోంది.

ఆ ప్రాజెక్టులు చేయాలని..
ఈ మేరకు ‘ఆర్టికల్‌ 370’ సక్సెస్ మీట్ లో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. ‘ఈ స్టోరీ ఓటీటీలో విడుదల కావాలి. అది థియేటర్లలో విడుదలైతేనే ప్రేక్షకులు ఆదరిస్తారన్న భావనతో కథలను ఎంపిక చేసుకోను. అందులో ఉండే పాత్రను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకుంటా. ఎంచుకునే పాత్రే కథలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రేక్షకులు కథకు కనెక్ట్‌ అవ్వాలి. వేదికేదైనా వారు ఆ కథతో ముందుకు సాగాలనేది నా అభిప్రాయం. ఏదేమైనా నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడు కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అని చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు