ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (CM Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యాదాద్రి ఈవోగా వైదొలగాలని గీతారెడ్డికి మౌఖిక ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈవో పదవి నుంచి గీతారెడ్డి (Yadadri EO Geetha Reddy) వైదొలిగింది. వివరాళ్లోకి వెళ్తే.. మూడేళ్ల కిందటే గీతారెడ్డి రిటైర్ అయ్యారు. అయితే.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గీతారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ అశంపై ఆ సమయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: CM Revanth: ఇరిగేషన్ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ విషయాలు దాస్తే చర్యలు ఉంటాయని వార్నింగ్!
ఇటీవలే దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టిన కొండా సురేఖను (Konda Surekha) గీతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవో పదవి నుంచి వైదొలగాలని ఆ సమయంలో కొండా సురేఖ ఆమెకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గీతారెడ్డి ఈవో పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన యాదాద్రికి కొత్త ఈవోగా రేవంత్ సర్కార్ ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. గీతారెడ్డి 2014 నుంచి యాదాద్రి ఈవోగా కొనసాగుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మంది అధికారులపై రేవంత్ రెడ్డి సర్కార్ బదిలీ వేటు వేస్తోంది. ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు తదితరులు కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందే తమ పదవులకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి వైదొలిగారు.