ISRO XPoSat Mission: శాస్త్ర సాంకేతిక రంగంలో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇందుకు నూతన సంవత్సరం తొలి రోజే వేదిక కానుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 ప్రయోగాల తరువాత ఇప్పుడు ఇస్రో జనవరి 1న అంటే సోమవారం నాడు తొలి ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని(XPoSat)ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. బ్లాక్ హోల్స్ వంటి ఖగోళ రహస్యాల గుట్టు విప్పే ఈ ప్రయోగంతో నూనత సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది ఇస్రో. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ -C58(PSLV) ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు.
పూర్తిగా చదవండి..ISRO: ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి..
సూర్యచంద్రుల తరువాత ఇప్పుడు బ్లాక్ హోల్ రహస్యాలను రాబట్టేందుకు ప్లాన్స్ వేస్తోంది ఇస్రో. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని(XPoSat)ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తారు.
Translate this News: