Twitter X : ఫేమస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(X) మళ్ళీ మరోసారి మొరాయించింది. కొంతసేపు పాటూ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. ఈరోజు ఉదయం ట్విట్టర్ మొరాయించింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో ఈ సమస్య వచ్చింది. ఎక్స్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే టైమ్‌లైన్ ఖాళీగా కన్పించింది. పెట్టిన పోస్టులు కన్పించడం లేదని యూజర్లు కంప్లైంట్స్ చేశారు. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా కనిపించాయి. ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదని అనేక మంది ఇతర సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
Also read:బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణం
రీసెంట్ గా ఎక్స్ ప్లాట్ ఫామ్ చాలాసార్లు ఆగిపోతోంది. కాసేపు పాటూ ఫ్రీజ్ అయిపోతోంది. దీనికి ప్రధాన కారణం తగినంత మంది సిబ్బంది లేకపోవడమే అంటున్నారు. దీనికి తోడు కంటిన్యూగా మారుతూ వస్తున్న టెక్సాలజీ కూడా అని చెబుతున్నారు. వీటితో పాటూ ఇతర సాంకేతిక కారణాలు ఇబ్బందిగా మారాయని టెకీలు చెబుతున్నారు. అందుకే ట్విట్టర్ లో తరుచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ట్విట్టర్ నుంచి మాత్రం దీని గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకూ ఎవరూ అనౌన్స్ చేయలేదు.