X Platform: ఎక్స్‌లో పోస్ట్ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే..షాకింగ్ డెసిషన్

ఎక్స్‌లో మళ్ళీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్లూ టిక్ అని, పేరు అని ఇలా ఇప్పటికే ఇందులో చాలా మార్పులు చేసిన ఎలాన్ మస్క్ తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా జాయిన్ అయ్యే యూజర్లు పోస్ట్ చేయాలంటే ఇక మీదట ఫీజులు చెల్లించాల్సిందే.

X Platform: ఎక్స్‌లో పోస్ట్ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే..షాకింగ్ డెసిషన్
New Update

 Elon Musk: ఎక్స్‌లో కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఎక్స్‌లో ఇక మీదట పోస్ట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధినేత చెప్పారు. బాట్స్‌ సమస్య నివారించాలంటే ఇలా చేయక తప్పదని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఎక్స్‌ డైలీ న్యూస్‌ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. మస్క్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎక్స్‌లో బాట్ సమస్యలు విరీతంగా వస్తున్నాయి. వీటివలన ప్రస్తుతం అమల్లో ఉన్న కృత్రిమ మేధ విధానాలు సమర్థవంతంగా పనిచేయట్లేదని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. క్యాప్చా లాంటి వాటిని ఇవి సులభంగా గ్రమించేస్తున్నాయి. అందుకే ఫీజును పెట్టాల్సి వస్తోందని చెప్పారు. అయితే అందరూ ఈ ఫీజు చెల్లించాల్సిందేనా అంటే అకౌంట్ క్రియేట్ చేసిన మొదట్లో కచ్చితంగా ఇవ్వాల్సిందేనని..మూడు నెలల తర్వాత చెల్లించకపోయినా పోస్ట్ చేయొచ్చని చెప్పారు. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి మొదలుపెడతారని మాత్రం చెప్పలేదు.

గత ఏడాది అక్టోబర్‌ నుంచి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో కొత్త వినియోగదారుల నుండి సంవత్సరానికి ఒక డాలర్‌ వసూలు చేస్తున్నారు. ఈ దేశాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు. కానీ వీరికి రిప్లై, రీపోస్ట్‌, కొత్త పోస్ట్‌ రాయడం వంటి ఆప్షన్లు ఉండవు. ఈ విధానాన్నే ఇప్పుడు ఇతర దేశాలకూ విస్తరించే యోచనలో మస్క్‌ ఉన్నారు.

Also Read:Elections: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు..తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 246 కోట్లు సీజ్

#fee #new-users #eleon-musk #x-platform #posts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe