/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-3-1-jpg.webp)
Ayodhya Ram Manir: యావత్ ప్రపంచం లోని హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో జరగబోతుంది. అయోధ్య (Ayodhya) లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకల కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు సుమారు 7 వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరు కాబోతున్నారు.
ఇప్పటికీ ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ,ఆయన కుమారుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో వారు నేరుగా పాల్గొనేందుకు ముందురోజే అయోధ్యకు వచ్చారు. లక్షలాది మంది రామ భక్తులు రాముల వారి వేడుకను చూసేందుకు వేచి ఉన్నారు.
#WATCH | Maharashtra: Thousands of diyas lit up in the shape of 'Siyavar Ramchandra Ki Jai' at Chanda Club Ground in Chandrapur, ahead of the Ram temple 'Pran Pratishtha' ceremony in Ayodhya pic.twitter.com/TsU7SeCttz
— ANI (@ANI) January 20, 2024
భారత దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని భక్తులు రాముని పై భక్తిని చాటుకుంటున్నారు. కానుకల రూపంలో పెద్ద ఎత్తున వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. తెలంగాణ సిరిసిల్ల జిల్లా నుంచి బంగారు చీర రాముల వారి కానుకగా వస్తే..హైదరాబాద్ నుంచి ముత్యాల హారం స్వామి చెంతకు చేరింది.
ఈ క్రమంలోనే మహారాష్ట్రా(Maharashtra) లోని చంద్రాపూర్ లో స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఒకే సారి 33, 258 మట్టిదీపాలను(Diyas) ''సియావర్ రామచంద్ర కీ జై'' అనేలా రాసి గిన్నిస్ రికార్డు (Guinnis Recor) సొంతం చేసుకున్నారు. పట్టణంలోని చందా క్లబ్ మైదానంలో రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు చెందిన మిలింద్ వెర్లేకర్ , ప్రసాద్ కులకర్ణి ఈ ఘనతను సాధించినందుకు గానూ పత్రాన్ని ఆదివారం ఉదయం ముంగంటివార్ కు అందించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సర్వజనిక్ వచనాలయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా చూశారు.
Also read: ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు!