World Marriage Day : ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

వివాహం అనేది ఒక సామాజిక, మతపరమైన కార్యక్రమం. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, సాంగత్యాన్ని బలపరిచేది వివాహమే. ఇవాళే ప్రపంచ వివాహ దినోత్సవం. కుటుంబ విలువలకు మద్దతివ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.

New Update
World Marriage Day : ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

Why World Marriage Day is Celebrated : ఈ రోజు ప్రపంచ వివాహ దినోత్సవం. ఐక్యరాజ్యసమితి 1983లో తొలిసారిగా ఈ రోజును ప్రకటించింది. ప్రపంచ వివాహ దినోత్సవం ప్రధాన లక్ష్యం కుటుంబ విలువలకు మద్దతు ఇవ్వడం, భార్యాభర్తల(Wife & Husband) సంబంధాలను బలోపేతం చేయడం, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడం. వివాహం అనేది ఒక ముఖ్యమైన సామాజిక ఆచారం. ప్రపంచ వివాహ దినోత్సవం(World Marriage Day) ద్వారా దీని ప్రాముఖ్యతను గుర్తించేలా ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రకటించింది.

ప్రపంచ వివాహ దినోత్సవం10 ప్రధాన లక్ష్యాలు:

--> కుటుంబ విలువలకు మద్దతివ్వడం.

--> భార్యాభర్తల మధ్య సంబంధాన్ని(Relationship) బలోపేతం చేయడం.

--> సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడం.

--> కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం.

--> వివాహం ప్రాముఖ్యతను వివరించడం.

--> తమ భాగస్వామి(Partner) తో సత్సంబంధాల ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడం.

--> వివాహం ద్వారా సమాజంలో మంచి పౌరులు, కుటుంబాలుగా మారడానికి ప్రజలను ప్రేరేపించడం.

--> కోర్టులలో వివాహిత జంటల హక్కుల పరిరక్షణను ప్రోత్సహించడం.

--> సమాజంలో సమానత్వం, గౌరవం, హక్కులను ప్రోత్సహించడం.

--> కుటుంబానికి స్థిరత్వం, శాంతిని బోధించడం.

Also Read : హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని మృతి.. వాళ్లే హత్య చేశారంటున్న పేరెంట్స్

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు