World Heart Day 2023: వరల్డ్ హార్ట్ డే ద్వారా ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది డబ్ల్యూహెచ్‌ఓ. గత కొన్నేళ్లుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు జనాలు. అందుకే గుండె జబ్బులు రాకుండా మంచి జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. గుండె జబ్బుల నివారణకు యోగా ఉపకరిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని యోగాసనాలు మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయిని చెబుతున్నారు. అవును యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రధానంగా గుండెను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం ప్రజలు డైట్ మెయింటేన్ చేయడంతో పాటు.. యోగాను కూడా ఆశ్రయిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో యోగాకు బాగా ఆదరణ పెరిగింది. తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ఈ యోగాసనాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ యోగాసానాలు ఏంటో ఓసారి చూద్దాం.
భుజంగాసనం: ఈ ఆసనం గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ఈ యోగాసనాన్ని కోబ్రా భంగిమ అని కూడా అంటారు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంతే కాదు ఈ యోగా వల్ల వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తడాసన చేయాలి: ఈ యోగాసనం చేయడం వలన హృదయ స్పందన మెరుగుపడుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ యోగాసనం గుండె వైఫల్యంతో బాధపడేవారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
వృక్షాసనం: ఈ యోగాసనం మన శరీరంలో స్థిరత్వం, సమతుల్యతను తెస్తుంది. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో చెట్టులా నిలబడి ఆసనం వేయాల్సి ఉంటుంది.
వీరభద్రాసనం: దీనిని యోధుల భంగిమ అని కూడా అంటారు. ఇలా చేస్తున్నప్పుడు, కాళ్ల మధ్య ఖాళీని ఏర్పరుచుకుంటూ నేలపై నిలబడి యోగా చేస్తారు. ఈ యోగాసనం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.
Also Read:
Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!