Panuti Comments Row: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమికి ప్రధాని మోదీనే కారణమంటూ సోషల్‌మీడియా వేదికగా కాంగ్రెస్ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. మోదీని పనౌతి(Bad Luck- దరిద్రం-దురదృష్టం-Bad Omen) అంటూ కాంగ్రెస్ కౌంటర్లు వేస్తోంది. వరల్డ్‌కప్ ముగిసిన దగ్గర నుంచి ఈ 'పనౌతి(Panauti)' పదం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. 2019లో చంద్రయాన్-2 మిషన్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటి నుంచి మోదీకి ఈ ట్యాగ్ వేస్తూ వెటకారం చేస్తోంది. వరల్డ్‌కప్ ఫైనల్‌ను మోదీ స్టేడియం నుంచి వీక్షించడం, ఇండియా ఓడిపోవడంతో ఈ పదాన్ని మరోసారి కామెడీకి ఉపయోగిస్తోంది కాంగ్రెస్. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ పదాన్ని ఫన్నీగా యూజ్ చేశారు. మోదీ(Modi) పేరు ఎత్తకున్నా.. ఆయనే పనౌతి అంటూ పరోక్ష సెటైర్లు వేశారు. దీనిపై సీరియస్ అయ్యిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
కంప్లైంట్.. వాట్ నెక్ట్స్:
‘ పనౌతి... పనౌతి... పనౌతి... మన కుర్రాళ్లు ప్రపంచకప్‌ను గెలవడానికి బాగానే ఉన్నారు, కానీ పనౌతి వాళ్లను ఓడిపోయేలా చేశాడు... ఈ దేశ ప్రజలకు తెలుసు’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఈసీ. అటు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేతలు మండపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఖండించదగినవి, అవమానకరమని ఫైర్ అయ్యారు. రాహుల్ తన అసలు రంగును బయటపెట్టుకున్నాడని.. అయితే తన తల్లి సోనియా గాంధీ అప్పట్లో మోదీపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఓటమిని చవిచూశారన్నారు రవిశంకర్ ప్రసాద్. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు ఆయన్ను 'మౌత్ కా సౌదాగర్' అని సోనియా పిలిచారని.. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా మునిగిపోయిందో అందరికి తెలిసిన విషయమేనన్నారు ప్రసాద్.
అదాని వచ్చి దోచుకుంటాడు:
అటు రాహుల్ వ్యాఖ్యలు నిరాశకు, మానసిక అస్థిరతకు నిదర్శనమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విరుచుకుపడ్డారు. ఇక రాహుల్ గాంధీ తాజాగా రాజస్థాన్ భరత్‌పుర్ సభలోనూ మోదీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. భరత్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ 'పిక్ పాకెట్ ఎప్పుడూ ఒంటరిగా రాడు, ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ఒకరు ముందు నుంచి, ఒకరు వెనుక నుంచి, ఒకరు దూరం నుంచి మీ దృష్టిని మరల్చే' ప్రయత్నం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అంశాలను లేవనెత్తుతూ ప్రజల దృష్టి మరల్చుతున్నారని.. ఇంతలో అదానీ వెనుక నుంచి వచ్చి డబ్బులు దోచుకుంటాడని ఫైర్ అయ్యారు.
Also Read: ఐసీసీ టాప్ కిరీటాన్ని కింగ్ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల!
WATCH: