World Cup 2023: పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న బ్యాటర్లు.. భారీస్కోరు దిశగా న్యూజీలాండ్ 

ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజీలాండ్ భారీ స్కోర్ దిశలో సాగుతోంది. 30 ఓవర్లో 211 పరుగులు ఆ జట్టు చేసింది. 

New Update
World Cup 2023: పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న బ్యాటర్లు.. భారీస్కోరు దిశగా న్యూజీలాండ్ 

వన్డే ప్రపంచకప్ 2023లో (World Cup 2023) న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్  జరుగుతోంది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. మొదటి పది ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసిన కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర భారీ స్కోరుకు పునాదులు వేశారు. దూకుడుగా ఆడే క్రమంలో 39 బంతుల్లో 35 పరుగులు చేసిన డెవాన్ కాన్వే మహ్మద్ రిజ్వాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆతరువాత వచ్చిన కేన్ విలియమ్సన్ తో కలిసి  రచిన్ రవీంద్ర పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 79 బంతుల్లో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మరోవైపు కేన్  విలియంసన్ కూడా ఎక్కడా తగ్గడంలేదు. 65 బంతుల్లో 72 పరుగులు చేసి దూసుకుపోతున్నాడు. దీంతో న్యూజీలాండ్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ ప్రపంచకప్‌లో(World Cup 2023) రచిన్ రవీంద్రకు మూడో ఫిఫ్టీ, వన్డే కెరీర్‌లో నాలుగో ఫిఫ్టీ పూర్తయ్యాయి. కేన్ విలియమ్సన్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో అర్ధ సెంచరీ కాగా, అతని వన్డే కెరీర్‌లో 44వ అర్ధ సెంచరీకావడం గమనార్హం. 

Also Read: టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్

రెండు జట్లకూ ఈ మ్యాచ్(World Cup 2023) చాలా ముఖ్యమైనది. పాకిస్థాన్ 7 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు, 4 ఓటములతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కాగా, న్యూజిలాండ్ 4 విజయాలు, 3 ఓటములతో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు పాక్ గెలిస్తే ఇరు జట్లకు 8 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు ఉంటాయి. దీని తర్వాత పాకిస్థాన్ చివరి మ్యాచ్ ఇంగ్లండ్‌తో, న్యూజిలాండ్ చివరి మ్యాచ్ శ్రీలంకతో ఆడనున్నాయి. రెండు జట్లు గెలిచి సెమీఫైనల్ అర్హత సమస్య 10 పాయింట్ల వద్ద నిలిచిపోతే, మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు అర్హత సాధిస్తుంది.

ఈరోజు న్యూజిలాండ్ గెలిస్తే ఆ జట్టు 10 పాయింట్లతో మూడో స్థానానికి (World Cup 2023)చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా 8 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. అంటే ఆ జట్టు సెమీ-ఫైనల్ రేసు నుంచి  దాదాపుగా నిష్క్రమిస్తుంది.

Please watch this interesting video:

Advertisment
తాజా కథనాలు