Women's Hockey Asian Champions Trophy 2023: ఇవాళ్టి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!!

స్వదేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫిలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు ( అక్టోబర్ 27) రాంచీలో షురూ అవుతుంది. మొదటిరోజు థాయ్ లాండ్ జట్టుతో సవితా పూనియా కెప్టెన్సీలోని భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30గంటల నుంచి ప్రారంభం అవుతుంది.

Women's Hockey Asian Champions Trophy 2023: ఇవాళ్టి  నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!!
New Update

భారత్ లో తొలిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫి 2023 జార్ఖండ్ లోని రాంచీలో నేటి నుంచి నవంబర్ 5వరకు జరగనుంది. ఈ ట్రోఫికి తొలిసారిగా భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్ ఏడవ ఎడిషన్ లో టాప్ ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తొలిసారిగా కాంటినెంటల్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. రాంచీలో జరిగే టైటిల్ కోసం భారత్, జపాన్, చైనా, కొరియా, మలేషియా, థాయ్ లాండ్ జట్లు తలపడనున్నాయి. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫిలో జపాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. 2021లో కొరియాలోని డోంఘేలో కొరియాను 2-1తో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్నారు.

ఇది కూడా  చదవండి: నిరుద్యోగులకు అలర్ట్.. 1720 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

కాగా భారత మహిళల హాకీ జట్టు 2016లో టైటిల్ ను కైవసం చేసుకుంది. 2013, 2018లో రన్నరప్ గా నిలిచింది. దక్షిణ కొరియా మూడు టైటిల్ లతో పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. జపాన్ 2013, 2021లో రెండు సార్లు విజేతగా నిలిచింది. రాంచీలో చైనా, మలేషియా, థాయ్ లాండ్ లు తమ తొలి టైటిల్ పై కన్నేసాయి. ఇటీవలే హాంగ్ జౌ ఆసియా క్రీడలు 2023 లో బంగారు పతకాన్ని గెలుచుకున్న చైనా ఫేవరేట్ గా పోటీలో ప్రవేశించనుంది. దక్షిణ కొరియా రజత పతకంలో సరిపెట్టుకోగా...భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇది కూడా  చదవండి: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు డేట్ పై కీలక ప్రకటన..!!

కాగా ఆతిథ్య భారత్ 7వ టోర్నీలో అత్యధిక ర్యాంక్ తోపాటు చైనా 10, జపాన్ 11, కొరియా 12, మలేషియా 18, థాయ్ లాండ్ 29 తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్ దశ తర్వాత పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ స్థానాలను ఖాయం చేసుకుంటాయి. కాగా ఈ మ్యాచ్  సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రసారం అవుతుంది.

#team-india #thailand #womens-hockey-asian-champions-trophy #womens-hockey-asian-champions-trophy-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe