Hyderabad: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన! చిన్న వర్షాలకే హైదరాబాద్, నాగోల్-ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందంటూ ఓ మహిళా వినూత్న నిరసనకు దిగింది. నడిరోడ్డుపై గుంతల్లో నిలిచిన మురికి నీటిలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. By srinivas 23 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Women Protest Over Bad Roads in LB Nagar: హైదరాబాద్ మహానగరంలో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయమవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన చిన్న వర్షానికే నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగున గుంతలుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. దీంతో అక్కడి కాలనీ వాసులంతా నడి రోడ్డుపై నిరసనకు దిగారు. అందులో ఒక మహిళ మరొక్క అడుగు ముందుకేసి రోడ్డు దుస్థితి బాగాలేదని, ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయిన ఎవరు పట్టించుకోవట్లేదని రోడ్డు మీద ఉన్న నీటి కుంటలో దిగి నిరసన వ్యక్తం చేస్తోంది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతోంది. #hyderabad #lb-nagar #women-protest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి