Dry Fruits: మహిళలు ప్రతిరోజూ బాదం ఎందుకు తినాలి?..తింటే ఏం జరుగుతుంది?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ, మహిళలు అలసట, చిరాకుతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. రోజూ బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

New Update
Dry Fruits: మహిళలు ప్రతిరోజూ బాదం ఎందుకు తినాలి?..తింటే ఏం జరుగుతుంది?

Dry Fruits: ఆరోగ్య నిపుణుల చెబుతున్నదాని ప్రకారం మహిళలు ప్రతిరోజూ తమ ఆహారంలో కొన్ని బాదం పప్పులను చేర్చుకోవాలని అంటున్నారు. ఎందుకంటే వీటిలో పోషకాహారం సమృద్ధిగా ఉంటుందని సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదం పప్పులను పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికీ  ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ, మహిళలు అలసట, చిరాకుతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. మహిళలు మంచి ఆహారం తీసుకుని సరైన వ్యాయామాలు చేస్తే వ్యాధుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.

బాదం గుండె ఆరోగ్యానికి మేలు:

బాదంపప్పులో విటమిన్ ఇ, కాల్షియం, కొవ్వు, మొక్కల ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటుని నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

బోలు ఎముకల వ్యాధి వచ్చే ఛాన్స్‌:

బాదంపప్పులలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మహిళలకు కాల్షియం అనేది చాలా అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ బోలు ఎముకల వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. కేలరీలు సమృద్ధిగా ఉన్నప్పటికీ బాదం తింటే బరువు నిర్వహణ సులభం అవుతుందని, బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పీచు పదార్ధాలు ఉండటం వల్ల ఎముకలకు ఎంతో బలం అని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి..? నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు ఖాయమా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు