ఓ మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన ఓ లేడీ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను బోల్తా కొట్టించింది. దాదాపు అతని వద్ద నుంచి రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిలాడీ లేడీ నుంచి సుమారు 84 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి యూకేకి చెందిన ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.
వయసు పెరుగుతుండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలను పొందుపరిచాడు. అక్కడ ఆ యువకుడికి సాన్వి అరోరా అనే యువతితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే జులై 7న ఆ మహిళ నగ్నంగా బాధితుడికి వీడియో కాల్ చేసింది. యువకుడికి తెలియకుండా ఆ కాల్ ను రికార్డు చేసింది. ఆ తర్వాత ఆ వీడియోతో ఆ బాధితుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. అలా ఇప్పటి వరకు సుమారు కోటి 14 లక్షలను లాగేసింది.
డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు బాధితుడి తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించింది. అలా కోటి రూపాయల వరకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా బెదిరిస్తుండటంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలి ఖాతా నుంచి సుమారు 84 లక్షలు రికవరీ చేశారు. కాగా ఆమె 30 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.