Woman Salon Problems:సెలూన్‌కి వెళ్లిన మహిళకు కిడ్నీ సమస్యలు..టెస్టుల్లో ఏం తేలిందంటే?

ఓ ట్యునీషియా మహిళ జుట్టుకు హెయిర్ స్టైలిస్ట్ 10 శాతం గ్లైక్సిలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్‌ను రాసాడు. ఈ రసాయనం వల్లే కిడ్నీలు దెబ్బతింటాయి. కెమికల్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రొడక్ట్స్ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Woman Salon Problems:సెలూన్‌కి వెళ్లిన మహిళకు కిడ్నీ సమస్యలు..టెస్టుల్లో ఏం తేలిందంటే?
New Update

Woman Salon Problems: సాధారణంగా హెయిర్‌కట్‌ చేసుకోవడానికి సెలూన్‌కి వెళ్తుంటారు. కొన్నిసార్లు కలుషిత ఉత్పత్తులను వాడటం వల్ల అవి జుట్టుపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. హెయిర్‌ సెలూన్‌కి వెళ్లిన మహిళ తిరిగివచ్చే సరికి కిడ్నీ పాడైపోయింది. ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కథనం ప్రకారం 26 ఏళ్ల ట్యునీషియా మహిళ సెలూన్‌కి వెళ్లి వచ్చాక కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చాయని పేర్కొంది. హెయిర్‌ స్ట్రేట్లింగ్‌ కోసం వాడే ఉత్పత్తుల వల్ల మూత్రపిండాల సమస్యలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. కేస్ స్టడీలో ఆ మహిళ మొదటి స్థానంలో నిలిచింది.

publive-image

మహిళ కిడ్నీలు ఎలా పాడయ్యాయి..?

ఆరోగ్య పరంగా ఏ సమస్యా లేకపోయినా డాక్టర్ వద్దకు వెళ్లేసరికి వాంతులు, జ్వరం, విరేచనాలు, వెన్నునొప్పి వంటి సమస్యలు వచ్చాయి. హెయిర్ ట్రీట్‌మెంట్ సమయంలో బాగా మంటగా అనిపించిందని మహిళ చెప్పింది.

టెస్టులు చేసిన వైద్యులు ఆమె రక్తంలో ప్లాస్మా క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు గుర్తించారు. ప్లాస్మా క్రియాటినిన్ అనేది కండరాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం. ఇది రక్తంలో కలిసినప్పుడు అది మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. మహిళ సెలూన్‌కి వెళ్లినప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆమె జుట్టుకు 10 శాతం గ్లైక్సిలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్‌ను రాసాడు. ఈ రసాయనం వల్లే కిడ్నీలు దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. కెమికల్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రొడక్ట్స్ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతాయని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్‌కు బానిసై కన్నకూతురిని ఏం చేసిందో చూడండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-care #best-health-tips #woman-salon-problems
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe