Vizag: పోలీసు స్టేషన్‌ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన!

తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్‌ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.

New Update
Vizag: పోలీసు స్టేషన్‌ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన!

తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్‌ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం..బాజీ కూడలి ప్రాంతానికి చెందిన గౌతమి పార్వతి ( 42) గత కొంతకాలంగా భర్త నుంచి వేరుపడి కూతురు, కొడుకుతో కలిసి ఓ అపార్ట్‌ మెంట్‌ లో నివాసం ఉంటున్నారు. ఆమె బట్టల వ్యాపారం చేస్తుంటారు. ప్రస్తుతం వారు అద్దెకు ఉంటున్న ఇంటిని ఇంటి ఓనర్‌ అమ్మకానికి పెట్టానని ఇల్లు ఖాళీ చేయాలని కొంత కాలం క్రితం తెలపడంతో..ఆ ఇంటిని నేనే కొంటాను అని గౌతమి అతనికి ఐదు లక్షల అడ్వాన్స్‌ ఇచ్చారు.

Also read: నాకు ఈ భర్త వద్దు నాన్న..మేళతాళాలతో స్వాగతం పలికిన పుట్టింటి వారు!

కానీ కొద్ది రోజుల తరువాత ఇంటి ఓనర్‌ మరోసారి తన మనుషులతో వచ్చి గౌతమి ఇంట్లో లేని సమయంలో ఆమెను బెదిరించి ఇంటిని ఖాళీ చేయాలని తెలిపాడు. దీంతో గౌతమి అడ్వాన్స్‌ తిరిగి ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్తానని తెలిపింది. అయినప్పటికీ కూడా ఇంటి ఓనర్‌ ఆమెను కుమార్తెను ఇంటి నుంచి బయటకు తోసేసి సామాను కూడా బయట పడేశారు. ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు.

దీంతో గౌతమి ఈ విషయం గురించి అదే రోజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గౌతమి కుమార్తెతో కలిసి ఆ ఇంటి వరండాలోనే ఉంటున్నారు. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌ చుట్లూ గౌతమి గత ఐదు రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోగా ఆమెకు సమాధానం కూడా చెప్పలేదు.

దీంతో మంగళవారం రాత్రి పెందుర్తి పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్న గౌతమి పోలీసు స్టేషన్‌ గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అపరాజిత, ఆమెను తీసుకుని వారు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. దీంతో ఇంటి ఓనర్‌ ని ఆమెకు తాళాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ వారు ఆమెనే తప్పుడు కేసులతో మమ్మల్ని వేధిస్తుందని ఆరోపించారు.

ఇళ్లు ఖాళీ చేయాలని చెబుతున్నప్పటికీ ఆమె వినిపించుకోవడం లేదని వారు తెలిపారు. ఈ క్రమంలో సీఐ వారికి సర్ది చెబుతుండగా ఆయనకు ఒత్తిడి పెరిగి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో బాధిత మహిళ గౌతమి మాట్లాడుతూ..గత ఐదు రోజులుగా మేము ఇంటి బయటే ఉంటున్నాం. సీఐని దీని గురించి అడిగితే నన్ను అసభ్య పద జాలంతో దూషించడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆమె పేర్కొంది. ఈ విషయం గురించి కమిషనర్‌ ఆఫీస్‌ లో కూడా ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ విషయం గురించి నాకు న్యాయం కావాలని ఆమె అన్నారు.

Advertisment
తాజా కథనాలు