/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Women-Suspecious-Death-jpg.webp)
Woman Suspicious Death in OYO Room: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుర్చీలో కూర్చున్న యువతి.. కుర్చున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన ప్రియ(25), చెన్నైకి చెందిన శ్రీహరి(26) ప్రేమించుకున్నారట. వీరిద్దరూ హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని చంద్రనాయాక్ తాండలోని ఓయో హోటల్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. రాత్రి బాగానే ఉండగా.. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఈ రోజు ఉదయం హాస్పిటల్‌కు వెళ్లాడు ప్రియుడు శ్రీహరి. చెకప్ అనంతరం హాస్పిటల్ నుంచి తిరిగి ఓయో రూమ్‌కు వచ్చాడు.
ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!
అయితే, డోర్ ఓపెన్ చేయగానే.. కూర్చున్న కుర్చీలలోనే యువతి విగత జీవిగా కనిపించింది. దాంతో ప్రియుడు శ్రీహరి నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకుని, ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. యువతిని శ్రీహరే చంపాడా? లేక మరేమైనా జరిగిందా? అని పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఓయో రూమ్ ఘటనకు సంబంధించిన వివరాలను వీడియోలో కూడా చూడొచ్చు..
https://www.youtube.com/watch?v=8rPM0gkS0w4
Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?