ప్రియుడి ఫోన్‌ చూసి ప్రియురాలు షాక్.. 13 వేల మహిళల న్యూడ్‌ ఫొటోలు లభ్యం

బెంగళూరులో ఓ బీపీఓ కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ.. తన బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌లో 13 వేల మంది మహిళల న్యూడ్‌ ఫొటోలు చూసి షాకైపోయింది. అందులో ఆమె ఫొటోలతో పాటు, ఇతర మహిళల ఫొటోలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి విచారణ చేస్తున్నారు.

New Update
ప్రియుడి ఫోన్‌ చూసి ప్రియురాలు షాక్.. 13 వేల మహిళల న్యూడ్‌ ఫొటోలు లభ్యం

ఓవైపు సాంకేతిక రంగం రోజురోజులు అభివృద్ధి అవుతుంటే.. మరోవైపు కొందరు కేటుగాళ్లు దాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. డీప్‌ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సైబర్‌ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇవి మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా కర్ణాటలోని బెంగళూరులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన్వీ అనే అమ్మాయి ( పేరు మార్చబడింది) తన బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌లో గ్యాలరీ ఓపెన్ చేసి చూడగా.. అందులో 13 వేల మహిళల న్యూడ్‌ ఫొటోలు ఉండటాన్ని చూసి షాక్ అయిపోయింది. అందులో ఆమె ఫొటోలతో పాటు మిగతా మహిళలలు ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. తన్వీ ఓ బీపీఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే అయిదు నెలల క్రితం ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆదిత్య సంతోష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నాలుగు నెలల నుంచి వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు.

Also Read: ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు

వీళ్లు సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్నింటిని రికార్డు చేసుకున్నారు. అయితే తాజాగా ఆమె సంతోష్‌కు తెలియకుండా ఫొన్ చూడగా ఇలా 13వేల న్యూడ్‌ ఫొటోలు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ఫొటోలు, అలాగే వాళ్ల కంపెనీలో పనిచేస్తున్న ఇతర మహిళల ఫొటోలతో పాటు మిగతా మహిళల ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో తన్వీ.. సంతోష్‌తో గొడవపడి విడిపోయింది. అలాగే తన కంపెనీలో పనిచేస్తున్న వారికి ఈ విషయం చెప్పింది. బీపీఓ లీగల్‌ హెడ్‌ అయిన అర్చన అనే మహిళ (పేరు మార్చబడింది) నవంబర్‌ 23న సంతోష్‌పై సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదిత్య సంతోష్, తన్వీ నాలుగు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారని.. వాళ్లిద్దరు సన్నిహితంగా ఉన్న క్షణాలను రికార్డు చేసుకున్నారని పేర్కొంది. అయితే తన్వీ వాటిని డిలెట్‌ చేయాలని సంతోష్‌కు తెలియకుండా ఫోన్‌ తీసుకుందని చెప్పింది.

కానీ ఫోన్‌లో వేలాది మంది మహిళల ఫొటోలు కనిపించాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆ బీపీఓ కంపెనీ సంతోష్ తన ఫోన్‌లో ఉన్న ఫొటోలను మార్ఫ్‌ చేసేందుకు కంపెనీకి చెందిన డివైజ్‌లను వాడలేదని స్పష్టం చేసింది. ఇక చివరికి రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్‌పై కేసు నమోదు చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సంతోష్‌ను విచారణ చేస్తున్నామని.. ఇలాంటి వేలాది మంది మహిళల న్యూడ్‌ ఫొటోలు అతని ఫోన్‌లో ఉండటం వెనుక అతని ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు