Kakinada District : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తుని మండలం రాజుల కొత్తూరు (Rajula Kotturu) లో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం (Women Dead Body) కనిపించడం కలకలం రేపింది. ఆమె కాళ్లు, చేతులను దుండగులు తాళ్లతో కట్టేశారు. తుని రహదారి పక్కనే 100 మీటర్ల దూరంగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ యువతిని అత్యాచారం (Rape) చేసి అతి దారుణంగా చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ యువతి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : దారుణం.. దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో యువతి మృతదేహాం
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరులో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Translate this News: