Salaar 2 : ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలు.. సెట్స్ లోకి డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు?

ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలుపెట్టనున్నారట. జూన్ లో ఈ మూవీ షూటింగ్ ఉండబోతోంది. ప్రభాస్ మొదట 'రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసి.. జూలై లో 'సలార్ 2' సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం.

New Update
Salaar 2 : ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలు.. సెట్స్ లోకి  డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు?

Salaar 2 Shooting Update : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఏక కాలంలో 2, 3 సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఓ సినిమా పూర్తవక ముందే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. అలా రీసెంట్ గా 'కల్కి' షూటింగ్ పూర్తీ చేసి 'రాజాసాబ్' షూట్ లో జాయిన్ అయిన ఆయన.. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్స్ ని ఏకకాలంలో పట్టాలెక్కించబోతున్నాడు.

వచ్చే నెల నుంచే 'సలార్ 2' షూటింగ్

ప్రభాస్ సలార్ 2, హనురాఘవపుడి సినిమాలను ఏకకాలంలో పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీటిలో 'సలార్ 2' రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచే మొదలు కానుందట. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ లవ్ డ్రామాని జులై లోనే స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఈ రెండు సినిమాల షూటింగ్స్ దాదాపు ఒకే నెలలో ఉండబోతున్నాయి.

Also Read : ‘కుబేర’ కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో!

ప్రభాస్ లేకుండానే షూటింగ్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలుపెట్టనున్నారట. జూన్ లో ఈ మూవీ షూటింగ్ ఉండబోతోంది. ప్రభాస్ మొదట 'రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసి.. జూలై లో 'సలార్ 2' సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం.

ప్రభాస్ వచ్చే వరకు ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులతో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ఇదే ఏడాది సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చుస్తే ప్రభాస్ నుంచి వచ్చే రెండేళ్లలో మొత్తం నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు