Wines Closed: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్!

TG: మందుబాబులకు చేదు వార్త. ఎల్లుండి హైదరాబాద్‌లో మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 23న హనుమాన్ జయంతి కావడంతో అన్ని వైన్ షాపులను మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్
New Update

Wines Will Be Closed On Tuesday: మందుబాబులకు చేదు వార్త. ఎల్లుండి మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 23న హనుమాన్ జయంతి కావడంతో హైదరాబాద్‌లోని అన్ని వైన్ షాపులను మూసివేయాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ALSO READ: కేసీఆర్‌ ఖేల్‌ ఖతం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నేడు ముక్క.. ఎల్లుండి చుక్క..

హైదరాబాద్‌లోని మాంసం ప్రియులకు ఈరోజు గండంగా మారిందనే చెప్పాలి.  ఇందుకు కారణం నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మూత పడడమే.  మహావీర్ జయంతి కావడంతో.. జైనులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ కాబట్టి.. అన్ని మాంసం షాపులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ లోని అన్ని మాంసం దుకాణాలు మూతపడ్డాయి.

#wines-closed #hyderabad-wines-closed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe