AP : ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్...! ఏపీలోని మందు బాబులకు మింగుడుపడని వార్త...రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Wine Shops Closed : ఏపీ (Andhra Pradesh) లోని మందు బాబులకు మింగుడుపడని వార్త... రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు (Wine Shops) మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల (General Elections) కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరుసగా మూడు రోజులు మద్యం షాపులు ఓపెన్ కావు అని తెలియడంతో మందుబాబులు ఆదివారం అర్థరాత్రి వరకు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. మూడు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. జూన్ 6న ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4న రోజంతా డ్రై డేగా ఉండనుంది. జూన్ 5వ తేదీ ఉదయం మద్యం షాపులు తెరుచుకుంటాయి. Also read: ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే! #andhra-pradesh #telangana #election-commission #wine-shops మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి