చైనా లో కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి..!

చైనా లో కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి..!
New Update

చైనా నేషనల్ మెడికల్ సెంటర్‌లో అంటువ్యాధుల విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా.జాంగ్ వెన్‌హాంగ్ అండ్ టీం ఓ పరిశోధన చేపట్టింది. అంటు వ్యాధుల వ్యాప్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతోందనే అంశంపై వీరు పరిశోధనలు చేస్తున్నారు. దీంతో అందరి దృష్టి ఈ రిసెర్చ్‌పై పడింది భవిష్యత్తులో ప్రపంచం మరిన్ని ప్యాండమిక్‌లను ఎదుర్కోనున్న నేపథ్యంలో చైనా నిపుణుల రీసెర్చ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.

వ్యాధికారక సూక్ష్మ జీవుల వ్యాప్తి, మ్యుటేషన్‌లపై క్లైమేట్ వార్మింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందనే విషయంపై తమ టీం ఫోకస్ చేస్తోందని డా. జాంగ్ వెల్లడించారు. భూ వాతావరణంలో మార్పులను బ్యాక్టీరియా, వైరస్‌లు అడాప్ట్ చేసుకుని వాటి రూపాల్లో మార్పులు చేసుకుంటాయని ఆయన వివరించారు. అందుకే, ప్యాండమిక్‌లకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసి, సమగ్రమైన వివరాలతో కూడిన ఆధారాలను పాలసీమేకర్స్‌కు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. క్లైమేట్ చేంజ్, పబ్లిక్ హెల్త్, అంటువ్యాధుల నియంత్రణ, పబ్లిక్ పాలసీ, తదితర రంగాలకు చెందిన నిపుణులు ఈ అంశంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా, అంటువ్యాధుల నిపుణులు, మైక్రోబయాలజిస్టులు.. పర్యావరణ, వాతావరణ నిపుణులతో కలిసి లోతైన పరిశోధన సాగించడానికి అవకాశం ఏర్పడిందని డా.జాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్యానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కొలాబరేటివ్ గ్లోబల్ అప్రోచ్ అవసరం ఉందన్నారు.

#china #covid
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe