World cup 2023: వరల్డ్ కప్‌ తుది జట్టులో అతడు ఉంటాడా..?

భారత 360 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్‌ యాదవ్ గ్రౌండ్‌కు ఇరువైపులా షాట్లు ఆడుతాడు. వెనక్కి బెండయ్యి అప్పర్ కట్ షాట్లు సులువుగా ఆడుతాడు. ఒక్కసారి మైదానంలో సెట్‌ అయితే బౌలర్‌ ఎవరు అనేది చూడకుండా చెలరేగి పోతాడు.

New Update
World cup 2023: వరల్డ్ కప్‌ తుది జట్టులో అతడు ఉంటాడా..?

భారత క్రికెట్‌ టీమ్‌లో మిస్టర్‌ 360గా పేరు గాయించిన ప్లేయర్ ఇప్పుడు వన్డేల్లో రాణించలేక పోవడానికి కారణం అదేనా..? ఈ టోర్నీలో భారత్‌ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ ద్వారా మేగా టోర్నీని ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీపాల్గొనే తుది జట్టులో ఆ ప్లేయర్‌ ఉంటాడనడంతో మాజీల అభిప్రాయం ఏంటి.? పొట్టి ఫార్మాట్‌కు అలవాటు పడ్డ ఈ యంగ్ బ్యాటర్‌.. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఏ వింధంగా ఆడుతాడు..

భారత 360 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్‌ యాదవ్ గ్రౌండ్‌కు ఇరువైపులా షాట్లు ఆడుతాడు. వెనక్కి బెండయ్యి అప్పర్ కట్ షాట్లు సులువుగా ఆడుతాడు. ఒక్కసారి మైదానంలో సెట్‌ అయితే బౌలర్‌ ఎవరు అనేది చూడకుండా చెలరేగి పోతాడు. వచ్చిన బాల్‌ వచ్చినట్లే బౌండరీకి తరలిస్తుంటాడు. ఫామ్‌లో ఉన్న సూర్య కుమార్‌ యాదవ్‌కు బౌలింగ్ చేయాలంటేనే ప్రత్యర్థి బౌలర్లు జంకుతారు. అలా ఉంటుంది సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్.

కాగా ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది ఈ మిస్టర్‌ 360 ఎక్కువ శాతం పొట్టి ఫార్మాట్ క్రికెట్‌ మాత్రమే ఆడాడు., వన్డే ఫార్మాట్‌ క్రికెట్‌ ఆడకపోడంతో అతడు వన్డే ఫార్మాట్లో ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీలు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్య కుమార్‌ యాదవ్ ఫామ్‌లోకి వస్తే అతన్ని అక్టోబర్ 8న జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు