Telangana: తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి

తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంకోసం రాష్ట్రమంతటా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

New Update
Telangana: తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి

తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో తెలంగాణ అంతటా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటి నిర్వహణ బాధ్యతలు గ్రామైక్య సంఘాలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక అలాగే పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయననున్నట్లు పేర్కొన్నారు.

Also Read: మీ పద్ధతి బాగాలేదు.. IAS, IPSలపై సీఎం సీరియస్!

ఇదిలాఉండగా.. పశ్చిమ బెంగాల్‌లోని దీదీ కా రసోయ్, కేరళలో ఉన్న క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం పూర్తైందని శాంతికుమారి చెప్పారు. తెలంగాణలో క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. మహిళ శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వాటికి కావాల్సిన స్థలం తదితర వివరాలతో రోడ్‌మ్యాప్ తయారుచేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ కమిషనర్‌కు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు