Chandrababu: సీఐడీ నయా స్కెచ్.. చంద్రబాబుకు తిప్పలు తప్పవా?!

చంద్రబాబుకు కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనారోగ్య కారణంగా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆయన.. జైలు బయట ప్రసంగించండం సీఐడీకి ఆయుధంగా మారింది. కోర్టు నిబంధనల ప్రకారం.. ఆయన మీడియాతో మాట్లాడటం, ప్రసంగించడం చేయొద్దు. కానీ, ఆయన జైలు బయట ప్రసంగించారు. దీనిని సీఐడీ సీరియస్‌గా తీసుకుంది. దీని ఆధారంగా బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Chandrababu: సీఐడీ నయా స్కెచ్.. చంద్రబాబుకు తిప్పలు తప్పవా?!
New Update

Chandrababu vs CID: టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ తిప్పలు తప్పవా? బాబు బెయిల్‌ను రద్దు చేస్తారా? మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ మేరకు సీఐడీ నయా స్కెచ్ వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాబు బెయిల్ రద్దు చేయించేలా సీఐడీ పావులు కదుపుతోందట. ఈ మేరకు నయా స్కెచ్ వేస్తోందట సీఐడీ.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. దాదాపు 52 రోజులు పాటు జైల్లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టులో బెయిల్ పొందిన చంద్రబాబు.. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఆయన అలా విడుదల అయ్యారో లేదో.. ఇలా కొత్త చిక్కుల్లో పడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. జైలు బయట ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఇప్పుడిదే ఆయనకు ఇబ్బందిగా పరిణమించనుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ వ్యవహారాన్ని సీఐడీ తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. జైలు బయట చంద్రబాబు మాట్లాడటాన్ని సీఐడీ సీరియస్‌గా తీసుకుందట.

వాస్తవానికి చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. కొన్ని కండీషన్స్ విధించింది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దు. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. Z+ సెక్యూరిటీ విషయంలోనూ కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని స్పష్టం చేసింది కోర్టు.

అయితే, చంద్రబాబు మాత్రం జైలు నుంచి విడుదల అవడమే ఆలస్యం.. జైలు బయటే మీడియాతో మాట్లాడారు. ప్రజలను, రాజకీయ పార్టీలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని సీరియస్‌గా తీసుకుంది సీఐడీ. జైలు బయట చేసిన ప్రసంగం.. రాజకీయ ప్రసంగం కిందకే వస్తుందని భావిస్తోందట సీఐడీ. దీన్ని ఆధారంగా చేసుకుని.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ ప్రసంగం చేయోద్దని కోర్టు షరతు విధించగా.. ఆ షరతును చంద్రబాబు ఉల్లంఘించారంటోంది సీఐడీ.

Also Read:

శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

#andhra-pradesh #chandrababu #cid
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe