Opinion poll : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది.ఈ తరుణంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం..మోదీ సర్కార్ లో ఉన్న కాన్ఫిడెన్స్ ను బయటపెడుతోంది. ఎన్నికల ముందు ఏ ప్రభుత్వాలు కానీ ఆచితూచి వ్యవహారిస్తుంటాయి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అయితే మరింత జాగ్రత్తగా ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా..ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో సమయానుసారంగా వ్యవహారిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు..ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి. నిన్న గాక మొన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సీఏఏ చట్టాన్ని అమలు చేసింది. అప్పటి నుంచి ముస్లిం వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తే...బీజేపేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయబోమని తేల్చి చెప్పాయి.ఈ తరుణంలో పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. రాబోయే లోకసభ ఎన్నికలపై సీఏఏ ప్రభావం చూపుతుందా లేదా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. మరి దేశ ప్రజలు సీఏఏకు జై కొట్టారా?మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాజకీయ పండితులు ఏం చెబుతున్నారు?
ఎన్నికలపై సీఏఏ ప్రభావం పడుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే ఎలా? ఏ మేరకు చూడాల్సి ఉంది? ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని ప్రజలను అడిగారు?సీఏఏ అమలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే బయటకు వచ్చిన లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.72 శాతం మంది ప్రజలు ఇది పోలరైజేషన్‌ను పెంచుతుందని విశ్వసించారు. ఎలాంటి ప్రభావం ఉండదని 20 శాతం మంది, మోదీని ముస్లింలు అర్థం చేసుకుంటారని 2 శాతం మంది, దీనిపై ఏమీ చెప్పలేమని 6 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
సీఏఏ అమలుతో బీజేపీ లాభపడుతుందా?
సీఏఏ అమలు తర్వాత నిర్వహించిన పలు సర్వేల్లో ..సీఏఏ అమలు వల్ల బీజేపీకి ప్రయోజనం ఉందా? అనే ప్రశ్నకు 62శాతం మంది ప్రజలు అవుననే సమాధానం చెప్పారు, బీజేపీ లాభపడుతుందని వెల్లడించారు.మరో 24శాతం మంది బీజేపీకి ఎలాంటి లాభం ఉండదన్నారు. 14శాతం మంది ఈ ప్రశ్నపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
పశ్చిమ బెంగాల్‌పై ప్రభావం ఎక్కువ:
బంగ్లాదేశ్‌లో మతం ఆధారంగా వేధింపులకు గురైన శరణార్థులు అత్యధిక సంఖ్యలో పశ్చిమ బెంగాల్‌లో ఉన్నందున పశ్చిమ బెంగాల్‌పై సీఏఏ అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీఏఏ అమలు అతిపెద్ద ప్రభావం...బెంగాలీ మటువా ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఉందంటున్నారు. ఆగ్నేయ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అటువంటి మూడు సీట్లు బంగావ్, రానాఘాట్, కృష్ణానగర్ ప్రభావం ఉంటుంది. ఈ మూడు సీట్లపై సీఏఏ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మతువా ఓటు కారణంగా, బొనాగావ్, రానాఘాట్ స్థానాల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖాయమంటున్నారు.
బీజేపీకి సానుకూల పవనాలు:
మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. సీఏఏ అమలుతో బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదని తేల్చి చెప్పాయి. ముస్లింలతోపాటు ఇతర వర్గాలు కూడా మోదీసర్కార్ కు జైకొడుతున్నట్లు సర్వేల్లో తేలింది. లోకసభ ఎన్నికల ముందు సీఎఎ అమలుతో పాటు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ సర్కార్ కు ప్రజలు మరోసారి పట్టకట్టడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహాసర్కార్ కీలక నిర్ణయం..బ్రిటీష్ కాలం నాటి 8 రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు..!