బాబా బాలక్‌నాథ్ మరో ‘యోగి’ అవుతారా? రాజస్థాన్ కాబోయే సీఎం ఆయనేనా?

బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ ను యూపీలో యోగి ఆదిత్యనాధ్ దారిలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఈ ప్రచారం మొదలైంది.

Rajasthan CM race:తాను సీఎం అభ్యర్ధిని కానని ప్రకటించిన బాబా బాలక్ నాథ్.. కారణాలు ఇవేనా?
New Update

రాజస్థాన్‌లో అధికార మార్పిడి సంప్రదాయం మళ్ళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 71 స్థానాల్లో.. 18 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపైనే అందరి దృష్టి ఉంది. యూపీ తరహాలో రాజస్థాన్‌లో హిందుత్వ ముఖచిత్రంగా చెప్పుకుంటున్న మహంత్ బాలక్‌నాథ్‌ను బీజేపీ మరో 'యోగి'గా మారుస్తుందా? ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ఎవరినీ ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు, అంతకుముందు మూడు ఎన్నికల్లో వసుంధర రాజే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నిలిచేవారు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడంతో సీఎం రేసులో మహంత్ బాలక్ నాథ్ పేరు వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్ రాజకీయాలలో, అతనిని 'యోగి' అని పిలుస్తారు ఎందుకంటే, అతను UP CM యోగి ఆదిత్యనాథ్ లానే దూకుడు హిందూత్వ రాజకీయాలను అనుసరిస్తాడు. ఇది మాత్రమే కాదు, బాబా బాలక్‌నాథ్ కూడా సీఎం యోగి వచ్చిన అదే నాథ్ శాఖ నుంచి వచ్చారు.

తిజారా సీటులో బాల్కనాథ్ ఆధిక్యంలో..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ నుంచి ఎన్నికల ప్రచారం వరకు తిజారా స్థానంలో బాల్కనాథ్ కి అండగా నిలిచారు. 2013లో తిజారా స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన మమన్ సింగ్ యాదవ్, ఈసారి తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించినా బాల్కనాథ్ ఆయనను ఒప్పించి పోటీ చేయకుండా చేయగలిగారు. ఇప్పుడు తిజారా స్థానంలో బాలక్‌నాథ్ ముందంజలో ఉన్నారు. ఆయన విజయం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.

రాజస్థాన్‌లోనూ యూపీ గేమ్?

2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేసినట్లే, రాజస్థాన్‌లోనూ 'యోగి' వ్యూహంతో గేమ్ ఆడనున్నారా? బీజేపీ కనుక ఇలా చేస్తే బాలకనాథ్ అదృష్టం తారాస్థాయికి చేరుకోవచ్చు. రాజస్థాన్‌లో హిందుత్వ కొత్త ముఖచిత్రంగా బాలక్‌నాథ్ ఆవిర్భవించడమే దీనికి కారణం.

అసలెవరీ బాబా...

బాబా బాలక్ నాథ్...ఇతని వయసు 41 ఏళ్ళు. ఏప్రిల్ 16, 1982న కొహ్రానా గ్రామంలో జన్మించారు. యదవ కులానికి చెందిన బాబా.. నాథ్ శాఖ తాలూకా ఎనిమిదవ ప్రధాన మహంత్. మహంత్ చందనాథ్ 29 జూలై 2016న బాలక్‌నాథ్‌ను తన వారసుడిగా ప్రకటించారు. అస్తల్, నాథ్ శాఖలలో ఇదే అతిపెద్ద స్థానం. ఇది బోహర్ నాథ్ ఆశ్రమం మహంత్ లని వీళ్ళని అంటారు. ఇతను రాజస్థాన్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. ఆల్వార్ ఎంపీ అయిన బాబా ప్రస్తుతం తిజారా నుంచి పోటీ చేస్తున్నారు. తిజారాలో గత 50 ఏళ్ళలో బీజేపీ ఒక్కసారే గెలిచింది. అయితే ఇక్కడ యాదవులు, దళితులు, ముస్లిమ్ లు ఎక్కువగా ఉంటారు. తిజారాలో ఎక్కువగా ముస్లిమ్ లు గెలుస్తుంటారు.

అయితే తిజారా ప్రజల ఆలోచన మరోలా ఉంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి అన్నది లేదు. కనీస రోడ్ సదుపాయం కూడా లేకపోవడంతో జనాలు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ గెలిచిన అభ్యర్ధులు ఎవరూ ఏమీ చేయలేదు. దీంతో ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. తిజారా వాసులకు అలాగే మొత్తం రాజస్థాన్ ప్రజలకు బాబా బాలక్ నీథ్ మీద మంచి అభిప్రాయం ఉంది. బాలర్ నాథ్ తనను తాను రాజస్థాన్ కా యోగి అని ప్రకటించుకున్నారు. అటువైపు యూపీలో ఆదిత్యనాథ్ సూపర్ సక్సెస్ అయ్యారు. దీంతో బాలక్ నాథ్ ను కూడా రాజస్థాన్ సీఎంగా చేయాలని బీజేపీ అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ దళితులు కూడా బాబా బాలక్ నాథ్ కు అనుకూలంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. వీటన్నింటినీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా రాజస్థాన్ లో ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండానే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ నేపథ్యంలో బాబా బాలక్ నాథ్ పేరు హైలట్ గా నిలుస్తోంది. బీజేపీలో బాలక్ నాథ్ అత్యంత వేగంగా ఎదిగారు. కేవలం 39 ఏళ్ళ వయసుకే రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితుడై అందరి దృష్టినీ ఆకర్షించారు. రాష్ట్ర ఎన్నికల్లో అడుగుపెట్టిన మొదటిసారే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచ తన సత్తాను చాటారు. అప్పటి నుంచి రాజస్థాన్ రాజకీయాల్లో బాలక్ చాలాచురుగ్గా పాల్గొంటూ అందరి దగ్గరా మంచి పేరు తెచ్చకున్నారు. తగ ప్రభుత్వం ముఖ్యమంత్రి అశొక్ గెహ్లాట్ కు బాలక్ నాథ్ ఎదుగుదల చుక్కలు చూపిస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ వసుంధరా రాజేకు బాబా బాలక్ నాథే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, బాబా బాలక్ నాథ్ ముఖ్యమంత్రి పదవి మీద స్పందించారు. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పారు. అధిష్టానం చెప్పింది చేయడం తప్ప తనకేమీ తెలియదని అన్నారు. దేశంలో బీజేపీ అంతా ఒక్కటేనని.. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలను పాటిస్తాం. గురువుగారి ఆశీస్సులతో సేవ చేస్తున్నాం అన్నారు బాబా బాలక్ నాథ్. మన శాఖలో గురువుగారి మాటలను సత్య వచనం అంటారని చెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే ఎవరు వద్దంటారని..అది మా అదృష్టమని చెప్పారు.

ఎగ్జిట్ పోల్‌లో బాలక్‌నాథ్ ముందంజ..

ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, బాబా బాలక్ నాథ్‌ను ప్రజలు బిజెపిలో అత్యంత ఇష్టమైన ముఖంగా స్పష్టం చేశారు. అప్పటి నుంచి బీజేపీ రాజకీయాల్లో వేడి పెరిగింది. అదే సమయంలో, బాల్క్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి తన పేరు వెలుగులోకి రావడంపై స్పందించారు. పార్టీ అగ్ర నాయకత్వం ఆదేశాలను పాటిస్తున్నానని చెప్పారు. ఇది తప్ప మనకు ఏమీ తెలియదన్నారు. గురువు ఆశీస్సులతో సేవ చేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్‌లో మిమ్మల్ని యోగిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని బాబా బాలక్‌నాథ్‌ను కొంతమంది ప్రశ్నిస్తే.. దీనిపై బాల్కనాథ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు.

బాల్కనాథ్ హిందుత్వ రాజకీయాలు..

యోగిలాగే బాల్కనాథ్ కూడా కాషాయ బట్టలు ధరించి హిందుత్వం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అల్వార్, దాని చుట్టుపక్కల జిల్లాలలో బాబా బాలక్‌నాథ్ గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటారని భావిస్తారు. మహంత్ బాలక్‌నాథ్‌ గెలుపు కోసం యోగి ఆదిత్యనాథ్‌ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడం ఇదే కారణం. రాష్ట్రంలో హిందూత్వ ఎజెండాకు పదును పెట్టడంలో బాలక్‌నాథ్ నిరంతరం నిమగ్నమై ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హిందుత్వ ముఖచిత్రంగా పరిగణిస్తుండగా, రాజస్థాన్‌లో బీజేపీ బాల బాలక్‌నాథ్‌ను హిందుత్వ ముఖంగా ప్రచారం చేస్తోంది. రాజస్థాన్ కొత్త యోగిగా బాలక్‌నాథ్‌ను అభివర్ణించడానికి ఇదే కారణం, అయితే బీజేపీ ఆయనకు అధికార కిరీటాన్ని అప్పగిస్తుందా అనేది మరి కొద్దీ గంటల్లో తేలనుంది.

#rajasthan #baba-balak-nath #race #cm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe