ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవం రేపు (సోమవారం) జరగనుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న రామభక్తులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అయోధ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు.
రాముడు భూమిపైకి వస్తాడు
అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని.. ఈ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపాడు. 'ఈ చారిత్రకమైన, అద్భుతమైన వేడకను మిస్ కాకండి. సంప్రదాయ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో రాముడు ఆలయంలోని ప్రధాన విగ్రహంలో దర్శనమిస్తాడు. యావత్ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి భూమి పైకి వస్తాడు' అంటూ పేర్కొన్నాడు.
అత్యాచార కేసులో ఇరుక్కుని
ఇదిలాఉండగా.. గతంలో నిత్యానంద కర్ణాటకలోని ఓ మఠానికి అధిపతిగా ఉండేవారు. అయితే 2010లో కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నిత్యానంద బెయిల్‌పై విడుదలై.. 2020లో దేశం నుంచి పారిపోయాడు. ఒక దీవిని కైలస దేశంగా ప్రకటించాడు. అందులో హిందు మతానికి పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు.