మనకు సమీపంలో ఉన్న గ్రహాలపై గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇప్పటికే ఈ ప్రశ్నకు సైంటిస్టులు వెతికి వెతికి అలసిపోయారు. అయితే అంగారక గ్రహంపై జీవం ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయా అని పరిశీలించేందుకు మార్టిన్ శిల నమూనాలను తిరిగి భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించింది.
ఇందుకోసం యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ ఈఎస్‌ఏతో కలిసి 2028లో రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్‌ను ప్రయోగించాలని ఎక్సోమార్స్ నిర్ణయించింది. ఒప్పందం ప్రకారం, NASA విజయవంతమైన ల్యాండింగ్‌కు అవసరమైన ప్రత్యేకమైన రోవర్ ప్రొపల్షన్ సిస్టమ్ భాగాలు, హీటర్‌లను అందిస్తుంది. అంగారకుడిపై దిగిన రోవర్ మంచు నమూనాలను సేకరించేందుకు గరిష్టంగా 6.5 అడుగుల లోతును తవ్వుతుంది.
కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా 300 గ్రాముల మట్టి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చి పరిశోధనలు చేయాలని నాసా నిర్ణయించింది. ఇంతకు ముందు అంగారకుడిపై జీవం ఏర్పడిందా? దాని ఆధారంగా మానవ మనుగడ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నాసా యోచిస్తోంది.