Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి

'బిగ్ బాస్' 8 లో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా సీరియల్ నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం హౌస్ లోకి అడుగుపెట్టనుందట. నాలుగో వారం లేదా ఐదో వారంలో ఈమె ఎంట్రీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

New Update
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి

Bigg Boss 8 Telugu :  'బిగ్ బాస్ సీజన్ 8.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్' అని నాగార్జున చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్న్స్ తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 న మొదలైన సీజన్ 8 నేటి ఎపిసోడ్ తో మొదటి వారం ముగియనుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. అంటే హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు.

ఈ నేపథ్యంలో నిర్వాహకులు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం హౌస్ లోకి అడుగుపెట్టనుందట. నిజానికి సీజన్ స్టార్ట్ అయినప్పుడే ఈమె హౌస్ లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె తన షూటింగుల్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లలేని పరిస్థితి ఉందట.

Also Read : ప్రభాస్ న్యూ లుక్.. డార్లింగ్ లో ఈ మార్పు గమనించారా?

తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తానని చెప్పిందట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. బిగ్ బాస్ నాలుగో వారం లేదా ఐదో వారంలో జ్యోతిరాయ్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#bigg-boss-8-telugu #serial-actress-jyothi-rai
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు