Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి
'బిగ్ బాస్' 8 లో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా సీరియల్ నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం హౌస్ లోకి అడుగుపెట్టనుందట. నాలుగో వారం లేదా ఐదో వారంలో ఈమె ఎంట్రీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.