Ghatkesar: ఆస్తికోసం భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. విముక్తి కలిగించిన పోలీసులు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన కట్టున్నభర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థానికి వచ్చి ఆయనకు విముక్తి కలిగించారు. By Vijaya Nimma 04 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Medchal: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన కట్టున్నభర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆయనకు విముక్తి కలిగించారు. వివరాల్లో వెళ్తే.. ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన భారతమ్మ(45), పత్తి నరసింహకృష్ణ (50) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అయిన నరసింహకృష్ణ తన భార్య భారతమ్మ పేరుతో ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. Your browser does not support the video tag. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహకృష్ణ తన పేరుపై ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం నరసింహకృష్ణ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా లభించలేదు. ఏప్రిల్ 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భార్య భారతమ్మకు తెలిసింది. దీంతో కుమారులతో కలిసి వెళ్లి ఆమె భర్తను ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేశారు. ఇంటి స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని అందరూ కలిసి చిత్రహింసలు పెట్టారు. అయితే స్థానికులు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. అందులో కొందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నరసింహ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను విడిపించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఇది కూడా చదవండి: వాడిన నూనెలో వండిన ఆహారం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? తెలిస్తే షాకే! #medchal-district #ghatkesar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి