Ants:చీమల్లో రక్తం కనిపించదు ఎందుకో తెలుసా?

చురుక్‌ మని కుట్టి పుసుక్కున జారుకుంటాయి చీమలు... అందుకనే అవి దొరకగానే పట్టుకుని కసితీర నలిపి అవతలేస్తాం. కానీ మనుషుల రక్తం తాగే చీమలను చంపినప్పుడు రక్తం కనిపించదు. ఎందుకో తెలుసా..

Ants:చీమల్లో రక్తం కనిపించదు ఎందుకో తెలుసా?
New Update

చీమలు...అత్యంత చిన్న జీవులు. కానీ అత్యంత శక్తిమంతమైనవి. సమిష్టి కృషికి మంచి ఉదాహరణలు. చిన్నగానే ఉంటాయి కానీ కుడితే మాత్రం ప్రాణం పోవాల్సిందే. చీమలు కుడితే మనకు రక్త వస్తుంది.కానీ అదే చీమను మనం చంపితే రక్తమే కనిపించదు. దానికి కారణం ఎమిటై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..

Also Read:చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్..

పసుపు రంగులో రక్తం..

అన్ని జీవాల్లోలాగే చీమల్లో కూడా రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్‌ లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్‌ అధికంగా ఉండటమే అందుకు కారణమట.

చీమల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్  ఉంటుంది.

రక్తం - హిమోలింఫ్ మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్‌ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్‌ చేరవేస్తుంటాయి.

అదీ సంగతి.....అందుకే చీమలను చంపినప్పుడు మనకు రక్తం కనిపించదు. అందుకే అవి పెద్దపెద్దగా కూడా అవవు.

#ants #blood #himoglobin #yellow
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe