Union Budget 2024 : ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా?

మన దేశ బడ్జెట్ ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టే విధానం 2017లో మోడీ సర్కార్ తీసుకు వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి నెలాఖరు-మార్చి మొదటి వారంలో బడ్జెట్ తీసుకువచ్చేవారు. ఫిబ్రవరి1న బడ్జెట్ పెడితే, దానిలోని అంశాలు ఏప్రిల్ నుంచి  అమలు చేయడానికి అవకాశం దొరుకుతుంది.

Union Budget 2024 : ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా?
New Update

Budget 2024-25 : బడ్జెట్ 2024-25 కౌంట్ డౌన్ మొదలైంది. కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2024 పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగాన్ని సమర్పిస్తారు. ఈసారి ఆమె ఏమి చేయబోతున్నారో.. వరాల జల్లులు ఉంటాయా? లేక వడ్డింపులు ఉంటాయా? అనేవ్ విషయం అప్పుడే తెలుస్తుంది. నిజానికి ఎన్నికల కారణంగా ఈసారి బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కావడం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సాధారణంగా మధ్యంతర బడ్జెట్(Union Budget) లో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరగదు. అయితే.. 2019లో బీజేపీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. 

సరే బడ్జెట్(Union Budget) ఎలా ఉంటుంది.. ఏముంటుంది.. ఇవన్నీ తరువాత ఎలానూ తెలుస్తాయి. ఈలోపు బడ్జెట్ కి సంబంధించి బోలెడు విశేషాలు ఉన్నాయి. వాటి గురించి వరుసగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫిబ్రవరి 1న మాత్రమే బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు? ఈ విషయం గురించి మీకేమైనా తెలుసా? అదీ కాకుండా ఈ విధానం బీజేపీ(BJP) ప్రభుత్వ హయాంలోనే ప్రారంభం అయింది అనే విషయం తెలుసా? ఇప్పుడు దీని కథేమిటో చెప్పేసుకుందాం. 

ఎప్పటినుంచి.. 

2014లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అధికారం చేపట్టారు. చాలా విషయాల్లో తనదైన ముద్ర వేసే విధానం మొదలు పెట్టారు. అందులో బడ్జెట్(Union Budget) కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే  2016 నుంచి బడ్జెట్‌కు సంబంధించిన నియమ నిబంధనలను మార్చడం ప్రారంభించారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో భాగంగా చేయడం ఈ సంవత్సరంలోనే ప్రారంభించారు. 

Also Read: ఏడాదికి కోటి ఎలక్ట్రిక్ టూవీలర్స్.. 25వేల కొత్త ఉద్యోగాలు.. ఓలా సంచలనం 

1924 నుంచి కూడా మన దేశంలో, రైల్వే బడ్జెట్‌(Railway Budget) ను ఎప్పుడూ ప్రత్యేకంగా..  సాధారణ బడ్జెట్‌కు ఒక రోజు ముందు తీసుకువచ్చేవారు. ఈ విధానాన్ని మార్చేసింది ప్రభుత్వం.  దీని తరువాత 2017 సంవత్సరంలో, సాధారణ బడ్జెట్‌ను సమర్పించే తేదీకి సంబంధించిన  ప్రధాన మార్పు వచ్చింది.  అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ సంవత్సరం ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. 

గతంలో ఇలా.. 

అంతకుముందు పార్లమెంట్ సమావేశాల ముగింపులో అంటే ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఇలా చేయడం వాళ్ళ కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం అయ్యే ఏప్రిల్ 1 వ తేదీ నాటికి బడ్జెట్ లోని అంశాలను అమలు చేయడం కష్టంగా ఉండేది. ఎందుకంటే, సమయం తక్కువగా ఉండేది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే, బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేయడానికి తగినంత సమయం ఉంటుంది. దీనివలన బడ్జెట్‌లో(Union Budget) ప్రకటించిన అంశాలు  సక్రమంగా అమలు చేయదానికి వీలవుతుంది. 

ఇంతకుముందు, ఈ ప్రక్రియలు - డిమాండ్లు పూర్తి కావడానికి మే-జూన్ వరకు సమయం పట్టేది. అయితే, దీనికి ముందు మరో మార్పు చేశారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ను సమర్పించే సమయాన్ని కూడా మార్చారు. బ్రిటీష్ హయాం నుంచీ  సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారట. కానీ ఆ సంవత్సరం ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి నుంచి  ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

Watch this interesting Video :

#narendra-modi #union-budget-2024 #nirmala-sitharaman #2024-budget-expectations #budget-2024-25
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe