Maha Shivaratri : మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి!

ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్ని కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే ఉపవాసం ఉండి శివున్ని ధ్యానించాలి. ఉపవాసం ఉండడం వల్ల శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

New Update
Maha Shivaratri : మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి!

Maha Shivaratri 2024 : హిందు పండుగల్లో మహా శివరాత్రి(Maha Shivaratri) ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ. భక్తులంతా ఉపవాసం ఉండి శివున్ని(Lord Shiva) కొలుస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి అని జరుపుకుంటున్నప్పటికీ ఏడాదికి ఓ సారి వచ్చే మహా శివరాత్రి మాత్రం ఎంతో విశేషమైనది. శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసం(Fasting), జాగారణం వంటివి చేస్తుంటారు. ఇవాళే మహాశివరాత్రి..!

ఇవాళ ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహా శివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం ఎంతో విశేషమైనదని. మిగిలిన ఏ పండుగకి ఉపవాసం చేయరు. కానీ శివరాత్రి రోజు మాత్రం కచ్చితంగా ఉపవాసం చేస్తారు. అసలు శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం చేస్తారు.

ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్ని కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివున్ని ధ్యానించడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతతం కలుగుతుంది. శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. రోజంతా శివునికి దగ్గరగా ఉండాలి అంటే మేల్కొని ఉండాలి. పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర రాదు. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివున్ని ధ్యానించాలి.

కాబట్టి శివరాత్రి రోజున ఎంతో నియమ నిష్టాలతో మహా శివుణ్ణి ధ్యానించాలి. అయితే బీపీ(BP), షుగర్(Sugar) ఉన్నవారు ఏదైనా అల్పహారం(Breakfast) తీసుకుని ఉపవాసం చేయవచ్చు. అల్పాహారం అంటే పళ్లెం నిండా పెట్టుకుని తినేయడం కాదు. పళ్లు, పళ్ల రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి తల స్నానం చేసి శివయ్యను దర్శించుకోవాలి. రోజంతా శివాలయంలో కానీ, ఇంటి వద్ద కానీ శివ నామ స్మరణ చేస్తూ ఉపవాసం ఉండాలి.

రాత్రి సమయంలో లింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి ని జపించిన కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు. ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం వంటి కార్యక్రమాలను శివరాత్రి రోజు నిర్వహించాలి.

Also Read : శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు