Health Tips : మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది..?

మూత్రం అనేది శరీరం సహజ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం హీమ్‌ను ఉత్పత్తి చేసి మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అణువు ఆక్సిజన్‌కు గురైనప్పుడు యూరోబిలిన్‌గా రూపాంతరం చెంది పసుపు రంగులో ఉండటానికి కారణమటున్నారు.

New Update
Health Tips : మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది..?

Urine Color : మూత్రం(Urine) ఎందుకు పసుపు రంగులో కనిపిస్తుంది అనే దీర్ఘకాల రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌(Nature Microbiology Journal) లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనంలో మూత్రం పసుపు రంగు(Yellow Color) లోకి మారడానికి దారితీసే పరిస్థితులను వివరించారు. పసుపు వర్ణద్రవ్యానికి యూరోబిలిన్ కారణమని అవగాహనకు వచ్చారు. మూత్రం అనేది శరీరం సహజ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ. అదనపు నీరు, ఫిల్టర్ చేసిన వ్యర్థాలు, ఎర్ర రక్త కణాలు వంటి మృతకణాల ఉప ఉత్పత్తులను మూత్రం కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం హీమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుందని అంటున్నారు.

గట్ మైక్రోబయోటాలో BilR ఎక్కువగా ఉంటుంది:

  • ఎర్ర రక్త కణాలు(Red Blood Cells) క్షీణించినప్పుడు ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి చేయబడిన బిలిరుబిన్ అనే నారింజ వర్ణద్రవ్యం ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. గట్ బ్యాక్టీరియా, ముఖ్యంగా ఫర్మిక్యూట్స్, బిలిరుబిన్‌ను యురోబిలినోజెన్ అనే అణువుగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయని అధ్యయనంలో తేలింది. ఈ అణువు ఆక్సిజన్‌కు గురైనప్పుడు యూరోబిలిన్‌గా రూపాంతరం చెందుతుందని, ఇది మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆరోగ్యకరమైన పెద్దల గట్ మైక్రోబయోటాలో BilR ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మూత్రం రంగులో దానిది కీలక పాత్ర అని, గట్‌లోని తక్కువ ఆక్సిజన్ కారణంగా గట్ సూక్ష్మజీవులను అధ్యయనం చేయడం సాధ్యపడుతుందని అధ్యయనంలో తేలింది.

ఇది కూడా చదవండి: అల్యూమినియం ఫాయిల్‌లో టాబ్లెట్స్‌ ఎందుకు ప్యాక్‌ చేస్తారు..?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు