Children Tips : మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది?

మానసిక ఒత్తిడి కారణంగా, జింక్, రక్త హీనత, కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.

New Update
Children Tips : మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది?

Mud : చిన్నప్పుడు మట్టి తినడం(Eating Mud), బలపం తినడం, రాతి పలకను పగలగొట్టి దాని ముక్కలు, పెన్సిల్(Pencil) చివర తినడం, గులకరాళ్లు తినడం చాలా మందిలో కనిపిస్తుంటాయి. ఇప్పటికీ చాలా మంది పిల్లల్లో ఈ అలవాటు కనిపిస్తోంది. కొందరికి పెద్దయ్యాక కూడా ఈ అలవాటు అలాగే ఉండిపోతుంది. ఇలాంటివన్నీ తినే అలవాటు ఎవరికైనా ఉంటే దాన్ని పికా అంటారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. కొన్ని చిట్కాలతో మట్టి తినే అలవాటును మాన్పించవచ్చు. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పిల్లలలో ఎక్కువ:

  • చిన్నపిల్లలు(Children's), గర్భిణీ స్త్రీలు(Pregnant Ladies) మట్టి లేదా గోధుమ గులకరాళ్లు తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఇది మొదటి సంవత్సరం వయస్సు నుంచి పళ్ళు వచ్చే వరకు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వయస్సు పిల్లలలో ఆ లక్షణాలు సాధారణమే అని నిపుణులు అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మట్టిని తినడానికి కారణం:

  • శరీరంలో ఇనుము లేకపోవడం, శరీరంలో జింక్, కాల్షియం లేకపోవడం కూడా కారణమని నిపుణులు అంటున్నారు. రక్త హీనత ఉన్నా ఇలాంటి అలవాట్లు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఈ అలవాటు వస్తుందంటున్నారు.

మట్టి తింటే ఏమవుతుంది?

  • కడుపులో పురుగులతో పాటు అతిసారం ఏర్పడుతుంది. అంతేకాకుండా పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇది స్కిజోఫ్రెనియా సూచనలు అని, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్‌గా వైద్యులు చెబుతున్నారు.

అరటి పండు:

  • పిల్లలకు అరటిపండ్లు(Banana) తినిపించడం వలన మట్టి తినే అలవాటును క్రమంగా తగ్గుతుంది. అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించి మంచి ఫలితం ఉంటుంది.
  • పిల్లల శరీరంలో కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా దృష్టి పెట్టాలి. కాల్షియం ఎక్కవగా ఉన్న ఫుడ్స్‌, కాల్షియం మందులు ఇస్తే మంచిది.

లవంగం నీరు

  • పిల్లలకు మట్టి తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు మంచిగా పనిచేస్తాయి. కొన్ని లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలకు తాపించాలి.ఈ నీరు వలన కొన్ని రోజుల్లో పిల్లలు మట్టి తినడం తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు