Maldeevs: ట్రెండింగ్‌ లోకి ''బాయ్‌కాట్‌ మాల్దీవులు''..టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న భారతీయులు!

మాల్దీవులకు , భారత్‌ కు ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం మాల్దీవుల ఎంపీ రమీజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సెలబ్రిటీలతో పాటు భారతీయులు కూడా #BoycottMaldives అనే హ్యష్‌ట్యాగ్ ను ట్రెండ్‌ చేస్తున్నారు.

New Update
Maldeevs: ట్రెండింగ్‌ లోకి ''బాయ్‌కాట్‌ మాల్దీవులు''..టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న భారతీయులు!

Maldeevs: మాల్దీవులు ..గత రెండు నెలల ముందు వరకు కూడా భారత్‌ (Bharat) తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఏటా లక్షలాది మంది భారతీయులు అక్కడి అందాల్ని చూడటానికి వెళ్తుండేవారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఆ మాల్దీవులు(Maldeevs) వెళ్లడానికి ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపించేవారు.

వెళ్దాం..వెళ్దాం అన్నవారే..

కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్దంగా తయారయ్యాయి. ఎంతో మంది వెళ్లడానికి ఆసక్తి చూపిన మాల్దీవులు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. వెళ్దాం..వెళ్దాం అన్నవారే..బాయ్‌కాట్‌ మాల్దీవులు అంటూ వెలుగెత్తుతున్నారు. నిన్నటి వరకు నెత్తిన పెట్టుకుని ఇప్పుడు దానిని బాయ్‌ కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నారు.

సెలబ్రిటీలు కూడా...

దీంతో ఇప్పటికే చాలా మంది తమ మాల్దీవుల ట్రిప్‌ ని క్యాన్సిల్‌ చేసుకున్నారు..చేసుకుంటున్నారు కూడా. దీంతో సెలబ్రిటీలు కూడా ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్ లోకి వచ్చేశారు. దీంతో భారత్‌ కు మద్దతు పెరిగిపోయింది. #BoycottMaldives అనే హ్యష్‌ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

అసలు మాల్దీవుల మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలుసా...నాలుగు రోజుల క్రితం ప్రధాని మోడీ కేంద్ర పాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్‌ లో పర్యటించడంతో పాటు సముద్రపు ఒడ్డున మార్నింగ్‌ వాక్‌ చేశారు. సముద్రంలో స్నార్కెలింగ్‌ కూడా చేశారు. అంతే కాకుండా సాహసాలు చేయాలనుకుంటే తమ లిస్ట్‌ లో లక్షద్వీప్‌ లను చేర్చుకోవాలని తెలిపారు.

దీంతో మాల్దీవులు ఎంపీ జహీద్‌ రమీజ్‌ మోడీ పై అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంఓ మాల్దీవులతో ఎవరూ పోటీ పడలేరని, లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలతో ఉందని ట్వీట్‌ చేశారు. దీంతో భారతీయులు మండిపడ్డారు. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు.

దీనికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ #BoycottMaldives ట్రెండ్‌ కి మద్దతు పలికారు. అత్యధికంగా పర్యాటకుల వెళ్లే , పంపే దేశం గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. మనం మంచిగా ఉండాలని అనుకుంటున్నప్పటికీ ..వారు మాత్రం ద్వేషం పెంచుకుంటున్నారని ...అందుకే మన సొంత పర్యాటకానికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే నటి శ్రద్ధా కపూర్ కూడా.. లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయని, సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని ట్వీటర్ వేదికగా వివరించింది.

ఇదిలా ఉంటే సచిన్ అయితే.. లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న తన వీడియోని ఒకదానిని షేర్ చేస్తూ, అక్కడి అనుభవాల్ని అభిమానులతో పంచుకున్నారు. అద్భుతమైన అందమైన ప్రదేశాలకు తనకు జ్ఙాపకాల నిధిని ఇచ్చిందని కొనియాడారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ కూడా లక్షద్వీప్‌ లోని అందమైన బీచ్‌ లో మోడీ సందర్శించడం చూసి ఆనందంగా ఉందని అంత అందమైన ప్రదేశం భారత్‌ లో ఉండడం గర్వకారణమని చెప్పారు. ఇలా ఇతర సెలెబ్రిటీలు లక్షద్వీప్‌కి మద్దతుగా ట్వీట్ చేస్తూ.. మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

Also read: బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

#modi #boycottmaldeevs #celebreties #lakshdweep #india
Advertisment
తాజా కథనాలు