చదువులో కష్టపడేతత్వం, ర్యాంకులు సాధించే టాలెంట్, తక్కువ వయసులోనే సీఈవో స్థాయికి ఎదిగిన ప్రతిభ, AI ఎథిక్స్‌లో అత్యంత తెలివైన 100 మంది మహిళలలో ఒకరు.. ఇవన్ని ప్రొషెషనల్ స్కిల్‌కు కొలమానలే కావొచ్చు.. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె మానసిక సమస్యల బాధితురాలే.. ఎందుకంటే నాలుగేళ్ల కన్నకొడుకును చంపి బ్యాగ్‌లో వేసుకోని వెళ్లిపోయిందంటే ఆమెలో ఎంత క్రూరత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడటానికి డిసెంట్‌గా, ఎన్నో అంతర్జాతీయ వేదికలపై డిబెట్లు, డిస్కషన్స్‌తో పాటు తన కంపెనీని టాప్‌గా తీసుకెళ్లేందుకు కష్టపడే నైజం ఉన్న సుచనా సేథ్(Suchana Seth) మెంటల్‌గా మాత్రం ఎంతో బలహీనురాలో అర్థం అవుతుంది. ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నా మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎన్ని ఘోరాలు, దారుణాలు జరుగుతాయో చెప్పడానికి బెంగళూరు-గోవా క్రైమ్ ఎపిసోడ్ చెబుతోంది. ఇంతకి ఎవరీ సుచనా సేథ్..? కన్నబిడ్డను, నాలుగేళ్ల చిన్నారిని ఎందుకు చంపింది?
సుచనా సేథ్ ఎవరు?
ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సుచనా 12 సంవత్సరాల అనుభవంతో టెక్ ఎక్స్‌పర్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మంచి పట్టు ఉన్న దేశంలోని అతి కొద్ది మందిలో ఆమె ఒకరు. దేశం మెచ్చే జాబ్ అయిన డేటా సైంటిస్ట్‌గా కూడా ఎంతో గుర్తుంపు తెచ్చుకున్నారమె. డేటా సైన్స్ బృందాలకు మార్గదర్శకత్వం చేయడంతో పాటు స్టార్టప్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్ ల్యాబ్‌లలో మెషీన్ లెర్నింగ్ సొల్యూషన్‌లను స్కేలింగ్ చేయడం లాంటివి ఉన్నాయి. 'AI ఎథిక్స్ లిస్ట్‌లో 100 మంది బ్రిలియంట్ విమెన్'లో ఆమె కూడా ఉన్నారు. ఇంకా, డేటా అండ్ సొసైటీలో మొజిల్లా ఫెలోగా, హార్వర్డ్ యూనివర్సిటీలోని బెర్క్‌మన్ క్లైన్ సెంటర్‌లో ఫెలోగా, రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలోగా ఆమె కొనసాగారు.
ఫిజిక్స్‌లో మాస్టర్స్, సంస్కృతం టాపర్:
'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్ CEO వ్యవస్థాపకురాలు, సుచనా ఫస్ట్-క్లాస్ M.Sc కలిగి ఉన్నారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆమె ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించారు. ఆమె సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా కలిగి ఉన్నారు. ఈ కోర్సులో మొదటి ర్యాంక్ ఆమెదేనని సుచన లింక్డిన్ ఫ్రొఫైల్ చెబుతోంది. అంతకు ముందు బీఎస్సీ పూర్తి చేశారు. కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో ఫిజిక్స్ (ఆనర్స్)లో పట్టా పొందారు.
ఎందుకీ హత్య చేశారు:
AI స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో గోవాలో అరెస్టు చేశారు. నిందితుడైన మహిళ తన కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళుతుండగా, కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి గోవా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకు తన భర్తను కలవకుండా ఉండేందుకు ఆమె ఈ దారుణమైన చర్య తీసుకుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సుచన 2010లో కేరళకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి 2019లో ఒక కొడుకు పుట్టాడు. అయితే మరుసటి ఏడాది వారిద్దరూ విడిపోయారు. 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతీ ఆదివారం కుమారుడిని సందర్శించేందుకు తండ్రికి కోర్టు అనుమతించింది. తన భర్త తన కొడుకుని కలిస్తే చిన్నారి అతని అధీనంలోకి వెళ్లిపోతాడని సుచన భయపడింది. ఇలా భర్త రాకముందే కుమారుడి జీవితాన్ని ముగించాలని ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె భర్త ఇండోనేషియాలో ఉన్నట్లు సమాచారం. అతడి ఇండియా రాకకు ఒక రోజు ముందు హత్య జరిగింది. గోవా డీజీపీ జష్‌పాల్ సింగ్ ఆదివారం తన కొడుకును చూసేందుకు తండ్రిని అనుమతిస్తూ కోర్టు నిర్ణయాన్ని ధృవీకరించారు.
Also Read: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ!
WATCH: