Adani: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

గత ఏడాది అమెరికాకి చెందిన హిండెన్‌బర్గ్‌.. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందని ఓ రిపోర్టును విడుదల చేసి సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా హిండెన్‌బర్గ్‌ ఎక్స్‌లో 'సమ్‌థింగ్ బిగ్‌ సూన్‌ ఇండియా' అని రాసుకొచ్చింది. ఇప్పడు మళ్లీ ఎవరి బాగోతాన్ని బయటపెడుతారనే చర్చ మొదలైంది.

New Update
Adani: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

Hindenburg: గత ఏడాది అమెరికాకి చెందిన షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ సంస్థ.. అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ రిపోర్టును విడుదల చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా హిండెన్‌బర్గ్‌ ఎక్స్‌లో మరో ట్వీట్ చేసింది. 'సమ్‌థింగ్ బిగ్‌ సూన్‌ ఇండియా' (Something Big Soon India) అని రాసుకొచ్చింది. దీంతో అదాని తర్వాత ఇప్పడు మళ్లీ ఎవరి బాగోతాన్ని బయటపెడుతారనే చర్చ మొదలైంది. గత ఏడాది జవవరి 24న అదాని గ్రూప్‌ను విమర్శిస్తూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రభావంతో ఒక్కసారిగా అదాని గ్రూప్స్‌కు చెందిన స్టాక్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 86 బిలియన్‌ డాలర్లు పడిపోయింది.

హిండెన్‌బర్గ్‌ ఈ రిపోర్టులో అదానీ గ్రూప్‌.. స్టాక్‌ మార్కెట్‌లలో అవకతవకలు, మోసాలకు పాల్పడిందని ఆరోపణలు చేసింది. అయితే హిండెన్‌బర్గ్‌ నివేదికను మాత్రం అదాని గ్రూప్‌ ఖండించింది. ప్రస్తుతం దీనిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే హిండెన్‌బర్గ్‌ ఇచ్చే నివేదిక ట్రేడింగ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్స్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

హిండెన్‌బర్గ్‌ ఏం చెప్పింది

అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఇలా విలువ పెరిగిన షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు పేర్కొంది. అలాగే అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని తెలిపింది. పన్నుల విషయంలో కూడా కరేబియన్, మారిషస్‌ల నుంచి ఈఏఈ దేశాల్లో అదానీ కుటుంబం కొన్ని ఫేక్‌ కంపెనీలను కంట్రోల్ చేస్తోందని చెప్పింది. వీటి నుంచే అవినీతి, అక్రమ నగదు బదిలీలకు పాల్పడుతుందని ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్‌ షేర్లు దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడుదారులు, రుణదాతల్లో నమ్మకం కలిగించేందుకు అదానీ గ్రూప్‌ మళ్లీ చర్యలు ప్రారంభించింది. దీంతో కుదేలైన షేర్లు తిరిగి గాడినపడ్డాయి.

హిండెన్‌బర్గ్ నివేదిక రావడంతో దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్‌ సంస్థలపై, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ హిండెన్‌బర్గ్‌ నివేదికను పరిగణలోకి తీసుకున్న సెబీ దర్యాప్తు చేసింది. అయితే అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని రూపొందించిన రిపోర్టును హిండెన్‌బర్గ్‌.. ముందుగానే తన క్లయింట్లతో పంచుకుందని సెబీ ఆరోపణలు చేసింది. రిపోర్ట్ విడుదలైన తర్వాత ఆయా క్లయింట్లు షార్డ్‌ పొజిషన్ల ద్వారా సంపాదించిన లాభాల్లో వాటా తీసుకుందని పేర్కొంది. ఇక హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. సెబీ దర్యాప్తు అనంతరం అదానీ గ్రూప్‌ సంస్థలపై సుప్రీంకోర్టు క్లీన్‌చీట్‌ కూడా ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు