Sesame seeds: శీతాకాలంలో ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచిదంటే..!! నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే వాటికి ప్రత్యేక స్థానం ఉంది. చలికాలంలో వీటి అవసరం ఎక్కువ. నువ్వుల మన ఆరోగ్యానికి చేసే మేలు మాటల్లో చెప్పడం కుదరదు. అనాదిగా ఆయుర్వేదంలో ఉపయోగించి నువ్వుల వల్ల మీకు కలిగే ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు. By Vijaya Nimma 19 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఆరోగ్యానికి కాల్షియం, పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. ఆరోగ్య ప్రయోజనాల ఇచ్చే ఈ నువ్వులు రెండు రకాలుగా ఉంటాయి. అవి నల్ల, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులను ఎక్కువగా వంటకాల్లో వాడుతారు. నల్ల నువ్వులను పూజాది కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. అయితే.. పోషకాల్లో మాత్రం నల్ల, తెల్ల నువ్వుల్లోనూ సమానంగా ఉంటాయి. నువ్వులు ఎముకల బలహీనతలను నివారించడంలో మంచి ఔషధం. చిన్నపిల్లలు బలంగా ఉండటానికి నువ్వుల లడ్డూ తినిపిస్తారు. ఈ నువ్వులు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి.. శరీర ఊబకాయాన్ని, రక్తపోటును, థైరాయిడ్, కీళ్లనొప్పులను, షూగర్ లెవల్స్ తగ్గించడానికి మేలు చేస్తాయి. అయితే ఎన్నో ప్రయోజనాలున్న తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెల్ల, నల్ల నువ్వులు ఎందుకు మేలో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వులు తినటం వల్ల ఉపయోగాలు: నువ్వుల్లో ఫైబర్ కంటెంట్, విటమిన్లు ఎక్కువ. ఇవి ఆరోగ్య ప్రయోజనాలతోపాటు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. తెల్ల నువ్వుల్లో ఎక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెతో పాటు ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల నువ్వుల్లో ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. చలికాలంలో నల్ల నవ్వులు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. నల్ల నువ్వులు తినటం వలన జ్ఞాపకశక్తి, మెదడు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల నువ్వుల్లో అధికంగా పోషకాలు ఎక్కువ.. అవి ఎంతో రుచిగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..? కూర్చునే బరువుకు చెక్ నల్ల నువ్వులు చలికాలంలో ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నివారించి.. ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతోంది. శరీరం సులభంగా వ్యాధులతో పోరాడాలంటే రోజూ నల్ల నువ్వులు తినటం మంచిది. నల్ల నువ్వులు పొడవాటి పొట్టుతో ఉన్నదున కొన్ని సూక్ష్మపోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. నల్ల నువ్వులు అనేక వృద్ధాప్య వ్యాధుల నుంచి కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ 40 గ్రాముల నువ్వులు తీసుకుంటే కీళ్ల నొప్పులు 65 శాతం తగ్గుతాయి. నువ్వుల్లో ఐరన్, కాపర్, జింక్, విటమిన్ బీ6 వంటివి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. #health-benefits #sesame-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి