విస్కీ, వోడ్కా లేదా బీర్ ఇందులో ఏది మంచిది? ఏది డేంజర్..!!

విస్కీ, వోడ్కా లేదా బీర్ ఇందులో ఏది మంచిది? ఏది డేంజర్..!!
New Update

మందుబాబులకు రమ్, వొడ్కా, వైన్, బీర్, విస్కీ మధ్య వ్యత్యాసం చాలా బాగా తెలుసు. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసి కూడా తాగేవాళ్లు ఉన్నారు. కానీ సాధారణ మధ్యతరగతి మందికి వీటి మధ్య వ్యత్యాసం గురించి కొంచెం మాత్రమే తెలుసు. కానీ ఆల్కహాల్ తాగనివారు చాలా మందే ఉన్నారు. అయితే వీటి గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం.

రమ్:
ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ. 40శాతం కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటుంది. ధర కూడా తక్కువే. చలికాలంలో చాలా మంది రమ్ తాగేందుకు ఇష్టపడతారు. చెరుకు రసం పులియపెట్టి దాని స్వేదనం ద్వారా తయారు చేస్తారు. కాల్చిన ఓక్ లేదా చెక్క బ్యారెల్స్ కొన్నాళ్లు నిల్వ చేయడం వల్ల దాని రంగు మారుతుంది. వాసన కూడా మారుతుంది. అంతేకాదు కొన్ని సారు పంచదార పాకాన్ని కొన్నిసార్లు రమ్ లో కలుపుతారు. రుచి రంగు కోసం. ఇది తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అసలు మొత్తానికి తాగకపోవడమే ఇంకా మంచిది.

వోడ్కా:
ఇది చూడటానికి అచ్చం నీళ్లలానే కనిపిస్తుంది. ఇందులో 60శాతం ఆల్కహాల్ ఉంటుంది. మానవశరీరంపై ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. ఇది రష్యా, తూర్పుఐరోపాలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. దాన్యం, మొలాసిస్ నుంచి తయారవుతుంది. ఇది పూర్తిగా గోధుమ, జొన్న, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు కాబట్టి ఉత్తమమైందిగా పరిగణిస్తారు.

వైన్:
వైన్ ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. రుచి కూడా తేలికగా ఉంటుంది. 9 నుంచి 18శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. ద్రాక్ష నుంచి ఈ వైన్ తయారు చేస్తారు.

విస్కీ:
విస్కీ గోధుమ, బార్లీ వంటి ధాన్యాల నుంచి తయారు చేస్తారు. ఇందులో 30 నుంచి 65శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. ఐరోపాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

బీర్:
బార్లీ, బియ్యం, మొక్కజొన్న నుంచి బీర్ తయారు చేస్తారు. ఇందులో 10శాతం ఆల్కహాల్ ఉంటుంది. దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది. అతిగా బీర్ తాగితే మత్తు ఎక్కువగా వస్తుంది. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ సూప్ తాగండి…స్లిమ్‎గా ఆరోగ్యంగా ఉండండి..!!

#health-tips #lifestyle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి