Rice: వేడి, చల్లటి అన్నం అంటే ఇష్టమా..? ఆరోగ్యానికి ఏది ఉత్తమమైదో తెలుసా..!!

వేడి అన్నం కంటే చల్లటి అన్నమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. చల్లని అన్నంలో స్టార్చ్ కంటెంట్ పేగు ఆరోగ్యానికి మేలుతోపాటు, జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ఆహారం జీర్ణం అవుతుంది. అన్నం వండిన తర్వాత 8 గంటలు ఫ్రీజర్‌లో పెడితే పోషకాలు పెరుగుతాయని చెబుతున్నారు.

New Update
Rice: వేడి, చల్లటి అన్నం అంటే ఇష్టమా..? ఆరోగ్యానికి ఏది ఉత్తమమైదో తెలుసా..!!

Rice Benefits: భారతదేశంలో అన్నం ప్రతిరోజూ తినేవారి సంఖ్య ఎక్కువ. ఇది భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. అందుకే అన్నంకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజా అన్నం అంటే వేడి అన్నం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చాలామంది అనుకుంటారు. మరికిందరూ చల్లటి అన్నం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. అయితే.. ఈ రెండింటిలో ఏది బెటర్ అనే డౌట్ ఎక్కవ మంది వస్తుంటుంది. రోజా అనం తీనేవారికి వేడి, చల్లంలో ఎది బెటర్‌ ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్యాలరీలు అధికం:

  • వేడి అన్నం కంటే చల్లటి అన్నం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చల్లని అన్నంలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చల్లటి అన్నం తినడం వల్ల జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ఆహారం జీర్ణం అవుతుంది. అంతే కాకుండా కోల్డ్‌రైస్ తినడం వల్ల కూడా శరీరంలో తక్కువ క్యాలరీలు ఉత్పత్తి అవుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.

అన్నం తినే విధానం:

  • వేడివేడి అన్నం తినకుండా ఎప్పుడు తిన్నా చల్లారిన తర్వాత తినాలని నిపుణులు అంటున్నారు. అన్నం కాస్త చల్లారాక 5 నుంచి 8 గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా తినడం వల్ల పోషకాలు పెరుగుతాయని చెబుతున్నారు.

జీర్ణక్రియ:

  • అన్నంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదంటున్నారు. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతాయి. అన్నంలో ఉండే స్టార్చ్ వల్ల జీర్ణ సంబంధమైన సమస్య దూరం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీరానికి శక్తి అధికం:

  • అన్నంలో ఎక్కువ కార్బోహైడ్రేట్ లభిస్తుంది. ఇది శరీరంలో శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా అన్నం కూడా సులభంగా జీర్ణమవుతుంది.

త్వరగా జీర్ణమవుతుంది:

  • చల్లటి అన్నం బరువుగా ఉండదు కాబట్టి అది తిన్నాక కడుపు భారంగా అనిపించదు, త్వరగా జీర్ణమవుతుందని ఆహారం నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : జుట్టు సంరక్షణకు మల్బరీని ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా వాడి చూడండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు