Raksha Bandhan: ఇండియా కాకుండా ఏ ఏ దేశాల్లో రక్షా బంధన్‌ జరుపుకుంటారో తెలుసా?

రాఖీ పండుగ విశ్వవ్యాప్తమై చాలా ఏళ్లు అయ్యింది. ఇండియన్స్‌ ఎక్కుడ ఉంటే అక్కడ ఈ పండుగ కనిపిస్తుంది. భారతీయులను చూసి విదేశీయులు కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, మలేషియా దేశాల్లో రాఖీ పండుగ కనిపిస్తుంది.

New Update
Raksha Bandhan: ఇండియా కాకుండా ఏ ఏ దేశాల్లో రక్షా బంధన్‌ జరుపుకుంటారో తెలుసా?

Raksha Bandhan celebrating nations : రక్షా బంధన్ లేదా రాఖీ విస్తృతంగా జరుపుకునే భారతీయ పండుగలలో ఒకటి. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు. ఇది ఇండియా అంతా జరుపుకొనే పండుగ..ముఖ్యంగా పెళ్లి అయిన అక్కా, చెల్లెళ్లు తమ తమ్ముడు లేదా అన్నల దగ్గరకు వెళ్లి రాఖీ కడుతుంటారు. అయితే ఇదంతా కేవలం ఇండియాలోనే జరగదు.. మిగిలిన దేశాల్లోనూ జరుగుతుంది. రక్షా బంధన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రాఖీ పండుగను జరుపుకుంటాయి:
అమెరికాలో రాఖీ:
భారతీయ జనాభా అమెరికాలో ఎక్కువగా స్థిరపడటంతో.. అక్కడి వారు ఈ పండుగను జరుపుకుంటారు. దేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోనూ పాటిస్తారు. రక్షా బంధన్ పండుగ అమెరికా పౌరుల దృష్టిని ఆకర్షించిన పండుగలలో ఒకటి.

యూకేలో రాఖీ:
రక్షా బంధన్ పండుగను యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్థిరపడిన ఇండియన్‌ కమ్యూనిటీ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. సోదర సోదరీమణుల ఒకరికొకరు ఈ పండుగను జరుపుకుంటారు. అక్కడ రాఖీ పండుగ ప్రాచుర్యం పొందింది. ఇండియా నుంచి ఆన్‌లైన్‌లో యూకేకి రాఖీని పంపవచ్చు.

కెనడాలో రాఖీ:
భారతీయులు అత్యధికంగా ఉన్న దేశాల్లో కెనడా ఒకటి. అక్కడ రక్షా బంధన్ లాంటి పండుగల వేడుకలు ఎక్కువగా జరుగుతాయి. కెనడాలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీలు ఈ పండుగను దేశంలో జరుపుకునేంత ఉత్సాహంతో జరుపుకుంటారు.

ఆస్ట్రేలియాలో రాఖీ:
ఆస్ట్రేలియాలో అనేక ఇండియన్‌ కమ్యూనిటీలు రక్షా బంధన్‌ను భారత్‌లో జరుపుకున్నట్టే జరుపుకుంటాయి. మన దేశంలో ఉన్నప్పుడు పాటించే అదే భావనతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో రాఖీ పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ దేశాలలోని భారతీయ నివాసితులు, అక్కడి స్థానిక ప్రజలు కూడా సోదరులకు రాఖీని కొనుగోలు చేసి కడతారు. ఇలా ఇండియన్స్‌ ఎక్కుడ ఉంటే అక్కడ రాఖీ పండుగు జరుగుతోంది. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా మన పండుగను జరుపుకుంటున్నారు. మన ఫెస్టివల్‌ని ఫాలో అవుతున్నారు. ఈ విధంగా రాఖీ ఖండాంతరాలు దాటింది.

ALSO READ: రక్షా బంధన్ గిఫ్ట్.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే?

Advertisment
తాజా కథనాలు