MLC Kavita: నేను జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయింది!!

60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు  ప్రశ్నించలేదన్నారు కవిత..

MLC Kavita: నేను జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయింది!!
New Update

MLC Kavita: 60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ ఇంకా గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రధాని మోదీని (Modi) ఎందుకు  ప్రశ్నించలేదన్నారు కవిత.

యూపీలో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారని.. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే  అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం  అయినా, మహిళలకు దక్కాల్సినన్ని  స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన అని ఆమె అన్నారు. తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి  కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క  ప్రతినిధి కూడా హాజరు కాలేదు.. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదన్నారు కవిత.

కవితకు రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదన్న కాంగ్రెస్..!

బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. మహిళలకు పెద్ద పీట వేయాలని చెబుతున్న సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్ట్ లో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. కవితకు మహిళా రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ లో ఏడుగురికి మాత్రమే  టికెట్లు ఇచ్చారు.. దానిపై పోరాటం చేద్దాం రమ్మని పిలిచారు. జంతర్ మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కలిపించిన ఘనత ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు జంతర్ మంతర్ దగ్గర బూటకపు ధర్నా చేసావని ఆమె ఫైర్ అయ్యారు. ఎంపీ గా ఉన్నప్పుడు.. ఏనాడైనా మహిళ రిజర్వేషన్లు గురించి మాట్లాడవా.. అని ఆమె నిలదీశారు. హైదరాబాద్ లో బాలికల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, అడ్డగోలుగా తాగిన తాగుబోతుల అరాచకాలు చూసి కవిత ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు.

Also Read:  టికెట్ దక్కలేదని వెక్కి వెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య..!

#kalvakuntla-kavitha #mlc-kavita #kavitha-comments-on-bjp #mlc-kalvakuntla-kavitha #kavitha-comments-on-congress #kavitha-fires-on-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe