Drink Coconut Water: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..?

ప్రకృతి సిద్ధంగా లభించే నీరు కొబ్బరి నీరు..ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగితే మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా డీహైడ్రేషన్‌ పోవడంతో పాటు ఎండ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

New Update
Drink Coconut Water: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..?

drink coconut water: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కువ మంది కొబ్బరి నీళ్లనే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చమట రూపంలో మన శరీరం కోల్పోయిన శక్తిని కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా మన బాడీ ఉష్ణోగ్రతను కూడా ఈ కొబ్బరి నీళ్లు కంట్రోల్‌లో ఉంచుతాయి. అయితే ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి.. ఎన్ని తాగాలి, ఎవరు తాగకూడదన్న సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. వైద్యులు చెబుతున్నదాని ప్రకారం నిత్యం ఉదయం 10 గంటల టైమ్‌లో గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారని అంటున్నారు. చర్మంలోని తేమను కొబ్బరి నీళ్లు కంట్రోల్‌లో ఉంచుతాయి. వివిధ రకాల బ్యాక్టీరియాలు, ఇన్‌ఫెక్షన్లపై పోరాడటానికి మనకు కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: కోడితో క్రిములు పరార్‌.. ఈ చిట్కా మీరు ట్రై చేయండి
కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువ శాతం ఉంటాయి. కప్పు కొబ్బరి నీళ్లలో 45 వరకు కేలరీలు కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్‌ ఎంతో మంచిదని అంటున్నారు. సోడా, షుగర్‌ ఉన్న పానీయాలు తీసుకోవడానికి బదులు కొబ్బరి నీళ్లు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సాయంత్రం కంటే ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. కాకపోతే కొద్దిగానే తాగాలని అంటున్నారు. మన రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియలను కూడా మెరుగ్గా ఉంచుతాయి. ఒక సహజ ఎలక్ట్రోలైట్‌లా కూడా కొబ్బరి నీళ్లు పనిచేస్తాయి. ఎక్సర్‌సైజ్‌లు చేసిన తిరిగి శక్తిని పొందడానికి కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొందరికి మాత్రం కొబ్బరి నీళ్లు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉంటే డైలీ కొబ్బరి నీళ్లు అవసరం లేదు
రక్తంలో ఎక్కువశాతం పొటాషియం నిల్వలు కలిగి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ల జోలికి పోకుండా ఉంటేనే బెటర్‌ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొందరు నిద్రపోయే ముందు, హైడ్రేటింగ్‌ కోసం కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇది సరికాదని నిపుణులు అంటున్నారు. దినచర్యను బట్టి, శరీర అవసరాలకు అనుగుణంగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటే డైలీ కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని, ఇందులో సహజ చక్కెర ఉంటుంది కాబట్టి మితంగా తాగితేనే బెటర్‌ అని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు